Kalki 2898AD : బుక్ మై షోలో 'కల్కి' ర్యాంపేజ్.. గంటలో అన్ని వేల టికెట్లు అమ్ముడయ్యాయా? 'కల్కి'మూవీ బుక్ మై షోలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన దగ్గరి నుంచి దేశ వ్యాప్తంగా గంటకి 5 వేల నుంచి 15 వేల చొప్పున టికెట్లు అమ్ముడవుతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ముందు ముందు ఈ కౌంట్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. By Anil Kumar 24 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Kalki Rampage In Book My Show : పాన్ ఇండియా హీరో ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ డ్రామా 'కల్కి 2898AD' మరో మూడు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇండియా వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అలా ఓపెన్ చేసారో లేదో నిమిషాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్ మై షోలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 5 వేల నుంచి 15 వేల టికెట్లు... 'కల్కి' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన దగ్గరి నుంచి దేశ వ్యాప్తంగా గంటకి 5 వేల నుంచి 15 వేల చొప్పున టికెట్లు అమ్ముడవుతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రిలీజ్ కి ఇంకా మూడు రోజులు టైం ఉండటంతో ఈ కౌంట్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. బుకింగ్స్ క్లోజ్ రిలీజ్ కు ముందు రోజు వరకు లక్షల్లో టికెట్లు అమ్ముడయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్ లో కల్కి ర్యాంపేజ్ నడుస్తోంది. Also Read : అభిమానికి క్షమాపణ చెప్పిన నాగార్జున.. వైరల్ అవుతున్న ట్వీట్! ఇక హైదరాబాద్ లో అయితే ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ బెనిఫిట్, స్పెషల్ షోలకు కూడా పర్మిషన్ రావడంతో వాటి టికెట్స్ నిమిషాల్లోనే బుక్ అయిపోయాయి. మరి ముందు ముందు ఈ బుకింగ్స్ ఏ రేంజ్ కు చేరుతాయో చూడాలి. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి 'కల్కి' ఓపెనింగ్స్ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. #kalki-advance-bookings #book-my-show #kalki-2898ad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి