/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-21T110337.382.jpg)
Kalki 2898AD Pre-Release Event Cancel : ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన 'కల్కి' మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ (Cine Lovers) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 27 న ఈ మూవీ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇలాంటి తరుణంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలింది.
గత కొద్ది రోజులుగా మూవీ టీమ్ కల్కి (Kalki 2898AD) ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ అనుకున్న స్థాయిలో లేవనే టాక్ కూడా వినిపించింది. రెండు రోజుల క్రితమే ముంబైలో సింపుల్గా కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ కోసం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్మాతలు పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి.
Also Read : ‘మీర్జాపూర్ 3’ ట్రైలర్ వచ్చేసింది.. నెక్స్ట్ లెవెల్..!
ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్లేనా?
దీంతో ఫ్యాన్స్ అంతా ఈ ప్రభాస్ 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందట. నిర్మాతలు ఇక్కడ ఎలాంటి ఈవెంట్ నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దానికి బదులు సింపుల్ గా ఈ రోజు(జూన్ 21) యూట్యూబ్ లో రిలీజ్ ట్రైలర్ ను వదులుతున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదని ఇలా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
Prepare for the Future!!!
The Release Trailer of #Kalki2898AD out Tomorrow at 6 PM.@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/U0DsBTmEoq
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 20, 2024