Kalki 2898AD : గ్రాండ్ గా 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్టులుగా ఆ ఇద్దరు బడా స్టార్స్? 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఈ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఈవెంట్‌కు తీసుకువచ్చే పనిలో మూవీ టీమ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. By Anil Kumar 09 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kalki 2898AD Pre - Release Event : ప్రభాస్ కల్కి '2898 AD' మూవీని ప్రమోట్ చేసేందుకు మేకర్స్ బాగానే కష్టపడుతున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో సుమరు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇటీవలే మొదలెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, బుజ్జి, భైరవ వీడియోస్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 10 న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగళూరులో ఎంపిక చేసిన థియేటర్లలో సోమవారం సాయంత్రం 6 గంటలకు 'కల్కి' ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇక రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. కాగా ఈ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. Also Read : బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల.. ఆ స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్! గెస్టులుగా ఆ ఇద్దరు... ఈ వేడుకకు దేశ వ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానించే పనిలో 'కల్కి' చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఈవెంట్‌కు తీసుకువచ్చే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. జూన్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. #kalki-2998-ad-pre-release-event #prabhas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి