Kalki 2898AD : ప్రభాస్ ఊచకోత.. ఓవర్సీస్ లో 'కల్కి' ఆల్ టైమ్ రికార్డ్..!

'కల్కి' నార్త్‌ అమెరికాలో ఆల్‌ టైమ్‌ రికార్డును నమోదు చేసింది. ఈ సినిమా ప్రీమియర్స్‌, ఫస్ట్ డే కలెక్షన్స్‌ కలిపి ఏకంగా 5 మిలియన్‌ డాలర్లు వసూలుచేసింది. దీంతో అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన ఏకైక సినిమాగా రికార్డు నెలకొల్పింది.

Kalki 2898AD : ప్రభాస్ ఊచకోత.. ఓవర్సీస్ లో 'కల్కి' ఆల్ టైమ్ రికార్డ్..!
New Update

'Kalki 2898AD' Movie Creates All Time Record In North America : పాన్ ఇండియా స్టార్ (PAN INDIA STAR) ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్ తెరకెక్కిన ‘కల్కి  మూవీ నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. మహాభారతంలోని కొన్ని పాత్రలు తీసుకోని దానికి కొంత ఫిక్షన్ జోడిస్తూ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని ఆడియన్స్ సినిమాపై ప్రసంశలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో కురుక్షేత్ర యద్దానికి సంబంధించి చూపించిన సీన్స్ హైలెట్ గా నిలిచాయి.

అలాగే ప్రభాస్-అమితాబ్ పెర్ఫార్మెన్స్, నాగ్ అశ్విన్ మేకింగ్ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేయగా.. తాజాగా ఈ మూవీ కలెక్షన్స్ పరంగా నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇండియా (India) లో కంటే ఓవర్సీస్ లో 'కల్కి' ర్యాంపేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అందుకు ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ నిదర్శనం. 'కల్కి' నార్త్‌ అమెరికాలో ఆల్‌ టైమ్‌ రికార్డును నమోదు చేసింది. ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లోనే 3.8 మిలియన్‌ డాలర్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది.

Also Read : సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘కంగువ’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

అల్ టైం రికార్డ్...

ప్రీమియర్స్‌లోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కలెక్షన్స్‌ క్రాస్‌ చేయడం విశేషం. ప్రీమియర్స్‌, ఫస్ట్ డే కలెక్షన్స్‌ కలిపి అమెరికాలో ‘కల్కి’ (Kalki 2898AD) ఏకంగా 5 మిలియన్‌ డాలర్లు వసూలుచేసింది. దీంతో అమెరికాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల్లో ‘కల్కి’ ఒక్క రోజులోనే 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఓవర్సీస్ మార్కెట్ లో 'కల్కి' బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేయడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

#prabhas #kalki-2998-ad #pan-india-star-prabhas #kalki-north-america-collections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe