/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-38-3.jpg)
Kalki 2898 AD Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 AD' తాజాగా ఓటీటీలో విడుదలైంది. ఆగస్టు 22 నుంచి అమెజాన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీ వెర్షన్‌లో కొన్ని సీన్స్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. థియేటర్లలో 181 నిమిషాలు ఉన్న కల్కి.. ఓటీటీకి వచ్చేసరికి 175 నిమిషాలకే కుదించారు.
సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ తొలగించారు. ఇందులో ప్రభాస్‌ను కప్ప అని పిలిచే సీన్ కూడా తీసేశారు. ఆ తర్వాత ప్రభాస్ ఇద్దరు భారీ కాయులతో చేసే ఫైట్ సీన్ నిడివిని కూడా తగ్గించారు. ఇక కాంప్లెక్స్‌లోకి వెళ్లిన తర్వాత అక్కడ దిశా పటానీతో ప్రభాస్ సాంగ్‌ను కూడా కట్ చేశారు. అంతేకాకుండా బీచ్ సీన్లను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. మెరూన్ దుస్తులలో ప్రభాస్‌తో మొత్తం సీక్వెన్స్ తీసేశారు.
the battle of the future begins NOW 🔥#Kalki2898ADOnPrime, Watch Now: https://t.co/kWB957C4UF
Available in Telugu, Tamil, Kannada, and Malayalam#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani@VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/gGAhGClV3c— prime video IN (@PrimeVideoIN) August 21, 2024
Also Read : ఎంగేజ్ మెంట్ చేసుకొని షాకిచ్చిన ‘నితిన్’ హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫొటోలు
ఇంటర్వెల్‌కు ముందు దీపికా మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సీన్‌ను ట్రిమ్ చేయడంతో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ తొలగించారు. అక్కడ థీమ్ ఆఫ్ కల్కి కొత్త లిరిక్స్ జోడించారు. ఇకపోతే డబ్బింగ్‌లోనూ అక్కడక్కడా మార్పులు చేశారు. థియేటర్ లో చూడకుండా డైరెక్ట్ ఓటీటీలో 'కల్కి' మూవీని చేసే ఆడియన్స్ కు ఇది భారీ షాక్ అని చెప్పక తప్పదు.