Kalki : ప్రభాస్ (Prabhas).. మోస్ట్ వెయిటెడ్ పాన్ వరల్డ్ మూవీ (PAN World Movie) కల్కి యూఎస్ ప్రీమియర్ షోస్ పూర్తి అయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు వారి అభిప్రాయాన్ని చెప్పేశారు. అక్కడి రివ్యూయర్లు రివ్యూలు ఇచ్చేశారు. తెలుగు సినిమాని హాలీవుడ్ రేంజ్ లో కల్కి నిలబెట్టిందని రివ్యూయర్లు అందరూ చెబుతన్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఒక రేంజ్ లో ఉందని అక్కడి ప్రేక్షకులు చెబుతున్నారు. మరి సినిమాలో ఏ అంశాలు వారిని బాగా ఆకట్టుకున్నాయని చెబుతున్నారో తెలుసుకుందాం.
ఫస్టాఫ్ మెల్లగా..
ఫస్టాఫ్ సినిమా స్లోగా నడిచినట్టుంటుంది అంట. సినిమాలో ఒక్కో పాత్రని రివీల్ చేసుకుంటూ స్టోరీని జాగ్రత్తగా రివీల్ చేస్తూ ఫస్టాఫ్ సాగిందని చెబుతున్నారు. అయితే, సినిమా స్టార్టింగ్ మాత్రం మిస్ కావద్దని అంటున్నారు. స్టార్ట్ కావడమే మనల్ని మరో ప్రపంచానికి తీసుకువెళ్లిపోతుందని అంటున్నారు. అలాగే కొత్తతరహాలో పురాణ కథ మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది అని యూఎస్ రివ్యూయర్స్ (US Reviewers) చెప్పారు. ఫస్ట్ హాఫ్ లో మొత్తంలో ఒక సాంగ్ కొంచెం లాగ్ అనిపించిందని అది లేకపోయినా సినిమాకి నష్టం ఉండకపోననీ వారంతా అభిప్రాయపడ్డారు.
సెకండాఫ్ వేరే లెవెల్..
ఇక సెకండాఫ్ సినిమా అదిరిపోయింది అంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయట. విజువల్ ఎఫెక్ట్స్ అయితే సినిమా నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా మన కళ్ళముందు అలానే ఉంటాయని రివ్యూయర్స్ చెబుతున్నారు.
మొత్తంగా చూసుకుంటే ప్రభాస్ కల్కి (Kalki 2898AD) సినిమా అంచనాలు అందుకున్నట్టే కనిపిస్తోంది. కొద్దిసేపట్లో మన దగ్గర కూడా మొదటి షో పూర్తి అవుతుంది. తరువాత సినిమా పై పూర్తి రివ్యూను తెలుసుకోవచ్చు..
కల్కి సినిమాపై ట్విట్టర్ లో వచ్చిన రివ్యూలు ఇక్కడ చూడవచ్చు..
Also Read : థియేటర్ల దగ్గర కల్కి హంగామా మామూలుగా లేదుగా.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్..