Medigadda: నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ.. కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్స్! ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారిన కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ వీడియోలను కేటీఆర్ నెట్టింట పోస్ట్ చేశారు. కాంగ్రెస్ కుల్లు, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుందని విమర్శలు గుప్పించారు. By srinivas 19 Jul 2024 in Latest News In Telugu వరంగల్ New Update షేర్ చేయండి KTR: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండలా కనిపిస్తోంది. లక్షల క్యూసెక్కుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ప్రాజెక్టుల జలకలకు సంబంధించిన వీడియోలను నెట్టింట ఫోస్ట్ చేశారు. అంతేకాదు ప్రాజెక్టు గొప్పతనం, కేసీఆర్ పని తనాన్ని ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు.. నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ! మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది.. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ, వందల కొద్ది యూట్యూబ్ ఛానెళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేసినా.. వాళ్ళ కుల్లును, కుతంత్రాలును కడిగేస్తూ… pic.twitter.com/KJr4wxQMMc — BRS Party (@BRSparty) July 19, 2024 ఈ మేరకు ‘కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు. నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ! మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది.. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ, వందల కొద్ది యూట్యూబ్ ఛానెళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేసింది. అయినా వాళ్ళ కుల్లును, కుతంత్రాలును కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలని చూసి ఓర్వలేని సన్నాసులు ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార.. సజీవ జలధార. కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురదజల్లే ప్రయత్నం ఎవరు చేసినా చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం. జై తెలంగాణ’ అంటూ ఎక్స్ వేదిగా ప్రాజెక్టుల ఫొటో, వీడియోలను షేర్ చేస్తూ కామెంట్స్ చేశారు. #ktr #kaleswaram #medigadda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి