Fight Over Kaleshwaram Project Continues : తెలంగాణ(Telangana) సాగునీటి ఆయకట్టుకు మూలస్తంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) చుట్టూ కొన్నాళ్లుగా రాజకీయ యుద్ధమే జరుగుతోంది. తెలంగాణలో బీఆర్‌ఎస్(BRS), కాంగ్రెస్(Congress) ల మధ్య కాళేశ్వరం రణరంగాన్ని సృష్టిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్(Ex. CM KCR) నేతృత్వంలోని గత పాలకవర్గం రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్టు భాగాల తరలింపులో నిపుణుల సలహాలను పట్టించుకోలేదని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనలు తీవ్ర చర్చకు దారితీశాయి. నిజానికి ఎన్నికల ప్రచారంలో కూడా కాళేశ్వరమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ ర్యాలీలు చేపట్టింది. కాళేశ్వరం విషయంలో బీఆర్‌ఎస్‌ను కార్నర్ చేసేందుకు ప్రయత్నించింది. చాలా వరకు సక్సెస్ కూడా అయ్యింది. అయితే ఎన్నికల తర్వాత ఈ ఇష్యూ మరింత ముదిరింది. ఈ ప్రాజెక్టు విషయంలో ఇరు పార్టీల చుట్టూ వ్యాపించిన యుద్ధమేఘాల నుంచి వర్షం కురవడం ప్రారంభమైంది. ఇప్పటికీ ఆ వాన ఓ వైపు దంచికొడుతూనే ఉండగా.. కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. అందుకే 'చలో మేడిగడ్డ'(Chalo Medigadda) కు పిలుపునిచ్చింది. ఇవాళ మేడిగడ్డకు బీఆర్‌ఎస్ వెళ్లనుంది.
మేడిగడ్డలోనే తేల్చుకుంటాం:
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్(KLIS) గురించి కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారాన్ని చేస్తోందని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. అందుకే 'చలో మేడిగడ్డ' కార్యక్రమాన్ని పూనుకున్నట్టు చెబుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేతృత్వంలో దాదాపు 150 మంది సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు ఇవాళ(మార్చి 1) మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి మేడిగడ్డకు వెళ్తారు. అక్కడ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్ట్ ముఖ్య అంశాలు, రాష్ట్రంపై దాని ప్రభావంపై ప్రజెంటేషన్ ఇస్తారు. తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, ఇతర రిజర్వాయర్లను కూడా సందర్శించేందుకు బీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తోంది.
కౌంటర్ విజిట్:
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, ఇతర కాంగ్రెస్ శాసనసభ్యులు ఫిబ్రవరి 13న బ్యారేజీ వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్‌గానే మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేయాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. నష్టానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ అసెంబ్లీలో డిమాండ్ చేసినా రేవంత్ సర్కార్ పట్టించుకోలేదని కేసీఆర్ పార్టీ సపోర్టర్స్ అంటున్నారు. ఇక
మరమ్మతులను వాయిదా వేయడం కరెక్ట్ కాదని బీఆర్‌ఎస్ చెబుతోంది. రానున్న వర్షాకాలంలో మూడు బ్యారేజీలు - మేడిగడ్డ, అన్నారం , సుందిళ్లను కొట్టుకుపోయేలా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది.
Also Read : 10లక్షల మంది విద్యార్థులకు అండ.. నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ!