Kajal Agarwal Birthday : టాలీవుడ్ 'మిత్రవింద' కాజల్ అగర్వాల్ గురించి ఈ విషయాలు తెలుసా? సౌత్ సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలో స్టార్ ఇమేజ్ అందుకొని అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. టాలీవుడ్ కి మిత్రవిందగా తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కాజల్ సినీ ప్రయాణం గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Anil Kumar 19 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Kajal Agarwal Birthday Special Story : సౌత్ సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలో స్టార్ ఇమేజ్ అందుకొని అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ నేడు (జూన్ 19) తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. టాలీవుడ్ కి అందాల చందమామగా, మిత్రవిందగా తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కాజల్ సినీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న ముంబైలో జన్మించింది.. ఎమ్.బీ.ఏ చదివి ఆ తర్వాత మార్కెటింగ్, బిజినెస్ లో రాణించాలని అనుకుంది. కానీ అనుహ్యంగా ఆమెకు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. దీంతో 'క్యూహో గయా నా' అనే హిందీ సినిమాతో వెండితెరపై అలరించింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ చెల్లెలిగా నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో డైరెక్టర్ తేజ తెరకెక్కించిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చందమామ సినిమాలో నటించింది. వరుస హిట్స్ తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా... ఈ రెండు సినిమాల్లో కాజల్ లంగా వోణిలో అచ్చ తెలుగమ్మాయిలా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈమెకి తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించి మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇందులో మిత్రవింద పాత్రలో తన అందం, అభినయంతో ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఈ ముద్దుగుమ్మ.. మగధీరతో ఫస్ట్ బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న కాజల్ ఆ తర్వాత.. బృందావనం, ఆర్య 2, డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్, బాద్ షా, నాయక్ వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా టాలీవుడ్ ను కొన్నాళ్ల పాటూ ఏలింది. Also Read : చిరంజీవికి రాజ్య సభ సీటు…సుస్మిత ఏమన్నారంటే! బిజినెస్ మెన్ తో పెళ్లి కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంది. అక్కడ విజయ్ , సూర్య వంటి స్టార్ హీరోల సరసన నటించింది. హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టింది. కెరీర్ మంచి ఫాంలోనే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను 2020 అక్టోబర్ 6న వివాహం చేసుకుంది.. పెళ్లయ్యాక ఆచార్య, ఘోస్ట్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే ఆచార్య సినిమా షూటింగ్ సమయంలోనే ప్రెగ్నెంట్ కావడంతో సినిమాల నుంచి తప్పుకుంది. 2021 లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లయ్యాకా కాజల్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని అంతా అనుకున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ అదే క్రేజ్.. కానీ ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ గత ఏడాది హీరోయిన్ గా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. బాలయ్యతో 'భగవంత్ కేసరి' మూవీలో నటించి హిట్ అందుకున్న కాజల్.. ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టింది. రీసెంట్ గా 'సత్యభామ' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెళ్ళయ్యి ఓ బాబు ఉన్నా కూడా కాజల్ తరగని అందంతో ఆడియన్స్ ను అలరిస్తూ ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ ను మరో వైపు సినీ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. #kajal-agarwal #actress-kajal-agarwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి