రహదారుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు.!

"గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది" అనే నిరసన కార్యక్రమం చేపట్టిన టీడీపీ జనసేన నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. రహదారుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదంటూ ధ్వజమెత్తారు.

రహదారుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు.!
New Update

MLA Siddareddy: టీడీపీ జనసేన ఉమ్మడిగా నిర్వహించిన "గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది" అనే నిరసన కార్యక్రమం తీవ్రంగా స్పందించారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో గత 30 సంవత్సరాలలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి చేసామన్నారు. వారి సహకారంతో అధికారంలోకి వచ్చిన కేవలం మూడు నెలల కాలం నుండే కదిరి ప్రజల స్వప్నంగా మిగిలిపోయిన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి రూ.230కోట్లతో త్వరలోనే పూర్తి చేయబోతున్నమన్నారు.

ఈ క్రమంలోనే మాట్లాడుతూ.." కాలేజీ సర్కిల్ నుండి చావడి వరకు రోడ్డు విస్తరణ పనులు చేశాం, కదిరి మున్సిపాలిటీలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించాం, 18 కోట్ల రూపాయలతో స్థానిక ఏరియా ఆసుపత్రి నందు అద్భుతమైన భవనాన్ని నిర్మించుకుంటున్నాం, మున్సిపల్ కౌన్సిల్ హాల్ ను నిర్మించాం, ప్రతి వార్డులో ఇంటర్నల్ రోడ్లను వేసాం, ఇంకను గడపగడప కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయం పరిధిలో 20 లక్షలతో పనులు చేపట్టమన్నారు.

Also Read: విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై మంత్రి అప్పలరాజు రియాక్షన్‌ ఇదే.!

కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 100 కోట్ల రూపాయలకు పైగా వెక్షించి 150 గ్రామాలకు పైగా తారు రోడ్లను, సిమెంట్ రోడ్లను వేసామన్నారు. 63 సచివాలయాల పరిధిలో సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను, వెల్నెస్ సెంటర్లను నిర్మించాం, నిర్మించుకోబోతున్నామన్నారు. 70 సంవత్సరాల ముందు నిర్మించిన తలుపుల నంబులపూలకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థానంలో నూతన భవనాలను నిర్మించుకుని ప్రారంభించుకున్నామన్నారు.

నాడు నేడు కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలో గల ప్రతి పాఠశాలను ప్రతి వైద్యశాలను ఆధునికరించుకున్నామని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలలో ఎన్నడైనా కార్యక్రమాలు చేశారా అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎక్కడైనా కూడా గంపడు మట్టి వేశారేమో ఆలోచించుకోండి! రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పనులు చేయలేదని గుంతలు ఉన్నాయి చెప్పడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.

#andhra-pradesh #anathapuram #tdp-janasena
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe