Kadapa: ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు చూతము రారండి

ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ముగ్గురు ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు, పుష్పాలు, రకరకాల ఆభరణాలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

New Update
Kadapa: ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు చూతము రారండి

Vontimitta Kodandaram : ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సములలో భాగంగా ఉదయం మోహిని అలంకారంలో కోదండరామయ్య భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు, పుష్పాలు, రకరకాల ఆభరణాలతో అలంకరించారు. భారీగా తరలివచ్చిన భక్తజనం స్వామివారికి మంగళహారతులు ఇచ్చారు. వాయిద్యాలతో ఊరేగింపు ఎంతో కోలాహలంగా జరిగింది. భజన బృందాలు, కళాకారుల చెక్క భజనలతో పాటు కోలాటాలు ఆకట్టుకున్నారు.

ఇది కూడా చదవండి: వేసవి సెలవులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రైల్వేశాఖ

కేరళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దక్షిణ భారతంలోనే రెండో అయోధ్యగా ఈ ఆలయానికి పేరు. మరో విశేషం ఏంటంటే దేశంలోనే ఎక్కడా లేని రీతిలో ఇక్కడి ఆలయంలో హనుమంతుడు దర్శనమివ్వడు. ఆంజనేయుడు లేని రామాలయం ఇదే కావడం విశిష్టత అంటున్నారు. రేపు కోదండ రామస్వామి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేశారు. రాములోరి కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. పండు వెన్నెల్లో జరిగే కల్యాణాన్ని చూస్తే జన్మధన్యం అవుతుందని పండితులు చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో అన్ని విభాగాలు సమన్వయం చేసుకుని పనిచేస్తున్నారు. వేసవి కారణంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పదిళ్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. తీర్థప్రసాదాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఇది కూడా చదవండి: ఇందుకే వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి

Advertisment
తాజా కథనాలు