KA Paul: కేసీఆర్ ను పరామర్శించిన కేఏ పాల్..

సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ను ఈరోజు పరామర్శించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు.

New Update
KA Paul: కేసీఆర్ ను పరామర్శించిన కేఏ పాల్..

KA Paul Met KCR : యశోద ఆసుపత్రిలో (Yashoda Hospital) చికిత్స తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను ఈ రోజు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు కేఏ పాల్‌. కేసీఆర్ తొందరగా కోలుకోవాలని ఆయన ప్రార్థనలు చేశారు.

Also Read: ఆసుపత్రికి రావద్దు.. కేసీఆర్ సంచలన వీడియో

కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్యం పట్ల వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. కేటీఆర్ (KTR) కూడా ఎంత బిజీగా ఉన్న కేసీఆర్ ను చూసేందుకు వచ్చిన వారిని హార్ట్ ఫుల్ గా రిసీవ్ చేసుకొని అందరితో ఓపికగా మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ దేవుడికి 75 ఏళ్ల వయసులో దగ్గరవుతున్నారని అన్నారు. రాజకీయాలు చేయడానికి తాను ఆసుపత్రికి రాలేదని అన్నారు. కేటీఆర్ ను ఇంతవరకు కలవలేదని.. కేసీఆర్ ఆసుపత్రిలో చేరడం.. నేను చూసేందుకు రావడం.. కేటీఆర్ ను కలవడం అంత దైవ నిర్ణయం అని అన్నారు.

యశోద ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..

కేసీఆర్ ను చూసేందుకు సోమాజిగూడ యశోద ఆసుపత్రికి జనాలు క్యూ కడుతున్నారు. తాజాగా కేసీఆర్‌ను చూసేందుకు సిద్దిపేట నుంచి వచ్చారు కొందరు మహిళలు. కేసీఆర్ ను కలవకుండా వారిని యశోద ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. లోపలికి పంపాలంటూ ఆసుపత్రి ఎదుట మహిళలు బైఠాయించారు. ఈ క్రమంలో మహిళలు ఆందోళన చేపట్టారు.

ALSO READ: Movierulz, iBOMMA లో సినిమాలు చూస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!

Advertisment
తాజా కథనాలు