పార్టీ కోసం వెయ్యి కోట్లు అడిగాడు.. జేడీపై కేఏపాల్ సంచలన ఆరోపణలు..

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన కొత్త పార్టీ పెడుతున్నారని, ఇందుకోసం రూ. 1000 కోట్లు అడిగారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోనే ఆయన కొత్త పార్టీ వస్తుందన్నారు పాల్.

New Update
KA Paul: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కేఏ పాల్ ఎన్నికల సాంగ్

KA Paul Allegations on Laxmi Narayana: సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ కోసం జేడీ తనను రూ. 1000 కోట్లు అడిగాడని ఆరోపించారు. శుక్రవారం నాడు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్‌సత్తా స్థాపించిన జయప్రకాష్ నారాయణ కంటే జేడీ ఏమైనా గొప్పవాడా? అని వ్యాఖ్యానించారు. ఎవరు వెయ్యి కోట్లు ఇస్తే వారి కోసం పార్టీ పెడతారా? అని ప్రశ్నించారు. మొదట్లో జేడీ తనకు మద్దతు ఇస్తానని చెప్పారని, ఇప్పుడేమో పార్టీ పెడుతున్నారని జేడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

పవన్-చంద్రబాబుపై సెన్సేషనల్ కామెంట్స్..

ఇదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు కేఏ పాల్. పవన్ మాటలు పిచ్చి వాడి మాటల్లా ఉన్నాయన్నారు. హరిరామ జోగయ్య లేఖను పవన్ చదివాడా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 27 శాతం ఉన్న కాపులు ఎందుకు ముఖ్యమంత్రి కాలేదని ప్రశ్నించారు. చిరంజీవి, పవన్ లాంటి ప్యాకేజి స్టార్స్ ఉండటం వల్లే కాపులు సీఎం కాలేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేస్తే ఇప్పుడున్న అప్పులు ఆయన తీర్చగలడా? అని ప్రశ్నించారు. 2014 లో సీఎం అయ్యి.. చంద్రబాబు చేసిందేంటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు - జగన్ - నాకు ముగ్గిరికి డిబేట్ పెట్టండి అంటూ ఊగిపోయారు పాల్. ఇక పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు. అతన్ని చిత్తు చిత్తుగా ఓడిస్తామని ప్రకటించారు కేఏ పాల్.

అతను లంచం తీసుకుని పని చేస్తున్నాడు..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ తీవ్రమైన ఆరోపణలు చేశారు కేఏ పాల్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎండీ అతుల్ భట్‌ని వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అతను లంచం తీసుకుని పని చేస్తున్నాడని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నస్ విషయంలో జిందాల్‌తో ఒప్పందం చేసుకున్నారని, దీనిపై ఉద్యమిద్దాం అనుకుంటే ఉక్కు పోరాట కమిటీ నేతలు సహకరించడం లేదన్నారు కేఏ పాల్. రాజకీయ పార్టీలకు 5 రోజులు సమయం ఇస్తున్నానని, స్టీల్ ప్లాంట్ పై చిత్తశుద్ధి ఉంటే ఎక్కడ దీక్ష చేద్దామో మీరే నిర్ణయించండి అని అన్నారు.

Also Read:

పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా 90 శాతం వరకు.. వివరాలివే!

ఒకే కారులో బావాబామ్మర్దుల జర్నీ.. వైరల్ గా హరీశ్, కేటీఆర్ ఫొటోలు!

Advertisment
తాజా కథనాలు