Lakshadweep Tour : కేవలం రూ. 250తో లక్షద్వీప్ వెళ్లొచ్చు.. పూర్తి వివరాలివే..!! కేవలం రూ. 250 నుంచి రూ. 300తో మీరు లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. హైదరాబాద్ నుంచి మంగళూరుకు వెళ్తే మంగళూరు పోర్టు నుంచి లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. కేరళ మీదుగా వెళ్లే వారు కొచ్చి నుంచి ఓడలో లక్షద్వీప్ వెళ్లడం మరింత సులభం. By Bhoomi 09 Jan 2024 in బిజినెస్ లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Lakshadweep : ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) పర్యటనతో లక్షద్వీప్(Lakshadweep) వార్తల్లో నిలుస్తోంది. లక్షద్వీప్ లో మోదీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరు కూడా లక్షద్వీప్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఈ వార్త తెలుస్తే మీరు గాల్లో తేలుతారు. కొత్త ఏడాదిలో ఎక్కుడికైనా వెళ్లాలనుకుంటే మాత్రం లక్షద్వీప్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తక్కువ ఖర్చుతోనే మీరు లక్షద్వీప్ వెళ్లి రావొచ్చు. ఎలా అనుకుంటున్నారా? కేవలం రూ. 250 నుంచి రూ. 300తో మీరు లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. మరీ ఇంత తక్కువ డబ్బులతో ఎలా వెళ్లొచ్చనే అనుమానం మీలో వస్తుంది కదూ? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవల్సిందే. కేరళ మీదుగా లక్షద్వీప్: గత వారం రోజులుగా లక్షద్వీప్ పేరు మారుమోగుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన లక్షద్వీప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అండర్ వాటర్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో చాలా మంది ఇఫ్పుడు లక్షద్వీప్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. నరేంద్రమోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ లో పర్యాటకం మళ్లీ జోరుగా ఊపందుకుంది. లక్షద్వీప్ కు వెళ్లేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. కేరళ(Kerala) మీదుగా వెళ్లే వారు కొచ్చి నుంచి ఓడలో ప్రయాణిస్తారు. మంగళూరు పోర్టు నుంచి : అయితే మీరు కూడా లక్షద్వీప్ వెళ్లాలనుకుంటున్నట్లయితే..మంగళూరు పోర్టు(Mangalore Port) ద్వారా కూడా వెళ్లొచ్చు. అంటే తెలుగు రాష్ట్రాల్లోని వారు ముందుగా మంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి తక్కువ ఖర్చుతో లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. ఇప్పుడు మంగళూరు పోర్టు ద్వారానే పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు లక్షద్వీప్ కు వెళ్తున్నాయి. మీరు ఈ పోర్టుకు వెళ్తే అక్కడి నుంచి సులభంగా లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. అంటే మంగళూరు చూడొచ్చు. ఇంకా లక్షద్వీప్ కు కూడా వెళ్లవచ్చు. కొన్నేళ్ల క్రితం వరకు మంగళూరు నుంచి లక్షద్వీప్ వెళ్లేందుకు పర్యాటక నౌక కూడా అందుబాటులో ఉంది. అయితే తర్వాత ఈ ఫెసిలిటీ లేకుండా పోయింది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. టూరిస్టు బోటు తిరుగుతున్న సమయంలో చాలా మంది కేవలం 250 నుంచి 300 రూపాయలకే లక్షద్వీప్ కల్పేని ద్వీపానికి చేరుకునేవారు. ఇప్పుడు కూడా ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి విమానాలు: మంగళూరు వెళ్లేందుకు హైదరాబాద్(Hyderabad) నుంచి విమాన సర్వీసులు ఉన్నాయి. అందువల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ట్రైన్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చితే విమానం కానీ రైలులో కానీ వెళ్లవచ్చు. చాలా మంది హైదరాబాద్ నుంచి కొచ్చి ..అక్కడి నుంచి లక్షద్వీప్ వెళ్తుంటారు. కొచ్చికి రైళ్ల ద్వారా కూడా వెళ్లవచ్చు. బస్సులు కూడా ఉంటాయి. అగట్టి ఎయిర్ పోర్టుకు కొచ్చి నుంచి విమానాలు ఉంటాయి. ఇది కూడా చదవండి: రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. యూరియాపై కీలక ప్రకటన..!! #pm-modi #lakshadweep-tour #mangalore మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి