Jr NTR : ఫోటోగ్రాఫర్ పై తారక్ సీరియస్.. అలా చేయొద్దంటూ వార్నింగ్? వీడియో వైరల్

New Update
Jr NTR : ఫోటోగ్రాఫర్ పై తారక్ సీరియస్.. అలా చేయొద్దంటూ వార్నింగ్? వీడియో వైరల్

War 2 : టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర', 'వార్ 2' మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 'వార్ 2' తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న తారక్.. రీసెంట్ గానే షూటింగ్ కోసం ముంబై వెళ్లి వచ్చారు. ఓ వైపు 'దేవర' షూట్ లో పాల్గొంటూనే మరోవైపు సమయం దొరికినప్పుడల్లా 'వార్ 2' షూటింగ్ కోసం ముంబై వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 'వార్ 2' లేటెస్ట్ షెడ్యూల్ కోసం ముంబై వెళ్లగా.. ఎన్టీఆర్ చుసిన ఫోటోగ్రాఫర్స్ కొందరు ఆయన్ని ఫోటోలు, వీడియోలు తీయడం స్టార్ట్ చేశారు.

ఎన్టీఆర్ అక్కడ ఓ స్టార్ హోటల్ లో బస చేసేందుకు వెళ్తున్న క్రమంలో ఫోటోగ్రాఫర్స్ ని ఫోటోలు తీయడంపై ఫోకస్ చేశారు. ఆ టైం లో ఫోన్ మాట్లాడుతున్న తారక్.. తనను ఫోటోలు తీస్తున్నారని గమనించి ఓ ఫోటోగ్రాఫర్ ని 'ఓయ్' అని పిలుస్తూ తనని ఫోటోలు తీయవద్దని మందలించారు. ఓ విధంగా చెప్పాలంటే ఆ ఫోటోగ్రాఫర్ పై అరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఎన్టీఆర్ చాలా సరదాగా ఉంటాడు. ఆయనకి అంత సులువుగా కోపం అనేది రాదు. అయితే ప్రెజెంట్ అయన 'వార్ 2' కోసం భారీగా కష్టపడుతున్నాడు.

సినిమా కోసం తన మేకోవర్ ని సైతం పూర్తిగా మార్చేశాడు. సినిమా కోసం అంతలా కష్టపడుతుంటే దీన్ని అర్థం చేసుకొని కొందరు అయన పర్మిషన్ లేకుండా ఫోటోలు తీసేందుకు ప్రయత్నించడంతో తన లుక్ లీక్ అవ్వొద్దనే ఉద్దేశ్యం తో ఎన్టీఆర్ వాళ్ళని వారించినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఏమాటకి ఆ మాట ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్ మాత్రం అదిరిపోయింది. వీడియోలో తారక్ స్టైలిష్ లుక్ చూసి ఫ్యాన్స్, నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

హై వోల్టేజ్ యాక్షన్ స్పై డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఎన్టీఆర్ సీక్రెట్ స్పై ఏజెంట్ గా కనిపించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2025 ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read :పెళ్లి గౌన్ ని రీ మోడలింగ్ చేయించిన సమంత.. నెట్టింట వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు