Jr NTR: మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది.. ఇదే నా ఉత్తమ బహుమతి!

మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరిందంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు జూనియర్ ఎన్‌టీఆర్. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు ఉడిపి శ్రీకృష్ణ మఠం దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి ఇదే అని చెప్పారు.

New Update
Jr NTR: మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది.. ఇదే నా ఉత్తమ బహుమతి!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ తన తల్లి కల ఎట్టకేలకు నెరవేర్చానంటూ ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలోనూ ఆమెకు అదిపెద్ద బహుమతి ఇచ్చానంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఈ మేరకు ‘నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు నేను ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి ఇదే. నాతో కలిసి దీన్ని సాధ్యం చేసినందుకు విజయ్ కిరగందూర్ సర్, నా ప్రియమైన స్నేహితుడు ప్రశాంత్ నీల్‌కి ధన్యవాదాలు. నా ప్రియమైన స్నేహితుడు రిషబ్ శెట్టికి ప్రత్యేక ధన్యవాదాలు. అతని మద్దతు ఈ క్షణాన్ని చాలా ప్రత్యేకంగా నిలిపింది’ అంటూ హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకున్నారు.

#junior-ntr #mother #udipi-srikrishna-matam
Advertisment
Advertisment
తాజా కథనాలు