Jr NTR: మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది.. ఇదే నా ఉత్తమ బహుమతి! మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరిందంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు ఉడిపి శ్రీకృష్ణ మఠం దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి ఇదే అని చెప్పారు. By srinivas 31 Aug 2024 in సినిమా నేషనల్ New Update షేర్ చేయండి NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తల్లి కల ఎట్టకేలకు నెరవేర్చానంటూ ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలోనూ ఆమెకు అదిపెద్ద బహుమతి ఇచ్చానంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. My mother's forever dream of bringing me to her hometown Kundapura and seeking darshan at Udupi Sri Krishna Matha has finally come true! To make it happen just before her birthday on September 2nd is the best gift I could give her. Thanks to @VKiragandur sir and my dearest… pic.twitter.com/sj3rtExmnp — Jr NTR (@tarak9999) August 31, 2024 ఈ మేరకు ‘నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు నేను ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి ఇదే. నాతో కలిసి దీన్ని సాధ్యం చేసినందుకు విజయ్ కిరగందూర్ సర్, నా ప్రియమైన స్నేహితుడు ప్రశాంత్ నీల్కి ధన్యవాదాలు. నా ప్రియమైన స్నేహితుడు రిషబ్ శెట్టికి ప్రత్యేక ధన్యవాదాలు. అతని మద్దతు ఈ క్షణాన్ని చాలా ప్రత్యేకంగా నిలిపింది’ అంటూ హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకున్నారు. #mother #junior-ntr #udipi-srikrishna-matam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి