జూబ్లీహిల్స్(Jubilee hills) ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పీఏ చేసిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మాగంటి గోపినాథ్ అనుచరుడు, పీఏగా ఉన్న భాస్కర్ అనే వ్యక్తి నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను కొట్టడమే కాకుండా తన స్నేహితులతో కూడా ఆ వ్యక్తిని కొట్టిస్తున్నాడు.
దెబ్బలు తింటున్న వ్యక్తికి ఒంటి నిండా రక్తం కారుతున్నప్పటికీ పట్టించుకోకుండా..ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. బాధితుడు వారికి చేతులు ఎత్తి మొక్కిన వారు పట్టించుకోకుండా కొడుతూనే ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న వారు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ వారు ఇంకా రెచ్చిపోయారు.
Also Read: బతుకమ్మ కంటే ముందు నిర్వహించే బొడ్డెమ్మ పండుగ…ప్రాధాన్యత..!!
వీడియోలో బాధితుడి మీద దాడి చేస్తున్న వారిని ఎమ్మెల్యే పీఏ భాస్కర్, అతని స్నేహితులు లలిత్, సూర్యగా గుర్తించారు. ఈ ఘటన గురించి స్థానికులు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు నిందితుల్ని గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నిందితులతో ఈ పని చేయించింది స్థానిక కార్పొరేటర్ రాజ్ కుమార్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా భాస్కర్ పలువురి పై దాడి చేసినట్లు సమాచారం. అతను రాజ్ కుమార్ పటేల్ కి బంధువు అని తెలుస్తుంది. ఇక ఈ వీడియోని చూసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భాస్కర్ లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.