Devara Team Going To Andaman Islands : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) - కొరటాల శివ(Koratala Siva) కాంబోలో తెరకెక్కుతున్న 'దేవర' మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ సైతం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.
ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసింది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా పార్ట్-1 షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. ఇక లేటెస్ట్ షెడ్యూల్ కోసం మూవీ టీమ్ అండమాన్ వెళ్లనున్నట్లు తాజా సమాచారం.
Also Read : ‘కంగువా’ నుండి గూస్ బంప్స్ అప్డేట్.. 10 వేల మందితో సూర్య ఫైట్?
అండమాన్ కి 'దేవర' టీమ్
'దేవర'(Devara) లేటెస్ట్ షెడ్యూల్ లో భాగంగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్(Janhvi Kapoor) పై రొమాంటిక్ సాంగ్ షూట్ చేయబోతున్నారట. ఈ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం మూవీ టీమ్ అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే ఉండటంతో బర్త్ డే తర్వాత మూవీ టీమ్ అండమాన్ వెళ్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ఎన్టీఆర్ బర్త్ డే(Birthday) కి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన మూవీ టీమ్ తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసారు. ఈ ప్రోమో ఒక్కసారిగా సాంగ్ పై అంచనాల్ని పెంచేసింది. ఇందులో తారక్ బ్లాక్ షర్ట్, బ్లాక్ లుంగీలో కనిపించి ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఎన్టీఆర్ సముద్రంలో పడవపై వస్తుండగా వెనకాల అనిరుద్ వాయిస్ తో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించింది.
అలాగే ఈ ఫుల్ లిరికల్ సాంగ్ అనిరుద్ స్టైల్ లోనే ఉంటుందని ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పేశారు. అంటే అనిరుద్ తన గత పాటల లాగే దేవర ఫస్ట్ సింగిల్ ను లైవ్ లోనే పాడనున్నాడు.ఓ వైపు లైవ్ లో అనిరుద్ పాడుతుంటే మరోవైపు సాంగ్ విజువల్స్ తో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు మేకర్స్.