/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ntr-1-jpg.webp)
Top 50 Asian Stars Of 2023 : నందమూరి తారక రామారావు(NTR)... ఈ పేరు వింటేనే గూస్‌బంప్స్ కామన్. గత రెండు సంవత్సరాల నుంచి తారక్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఆర్‌ఆర్‌ఆర్(RRR) సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఫిదా అయిపోయారు.
ఆ పాత్రకు ఎన్టీఆర్ తప్ప మరెవరూ సరిపోరూ అన్నంతగా నటించి అందరినీ మెప్పించాడు. నాటునాటు పాటతో ఆస్కార్ అవార్డుని తీసుకోచ్చి తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఘనత ఎన్టీఆర్, చరణ్ ది. ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకుని తారక్ రికార్డులు సృష్టిస్తున్నాడు.
ఈ క్రమంలో తాజాగా బ్రిటన్ లో పాపులర్ ఏసియన్ వీక్లీ న్యూస్ ఈస్ట్రన్‌ఐ 2023కి గానూ టాప్ 50 ఏసియన్ స్టార్స్(Top 50 ASIAN STARS) జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో తారక్ పేరు ఉండడం ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఈ జాబితాలో తారక్ 25వ స్థానంలో ఉన్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ లిస్టులో నిలిచిన ఏకైక తెలుగు నటుడు తారకే కావడం విశేషం.
దీంతో ఈ విషయం తెలిసిన తారక్ అభిమానులతో పాటు తెలుగు చిత్రపరిశ్రమ పండుగ చేసుకుంటుంది. తారక్ కి ఈ గౌరవం దక్కడం పట్ల పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క అమెరికన్ మ్యాగ్‌జైన్ వెరైటీ విడుదల చేసిన అత్యంత ప్రభావశీలురు 500 జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక తొలి సౌత్ స్టార్ గా రికార్డు సొంతం చేసుకున్నాడు తారక్.
తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఇందులో అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది.
NTR @tarak9999's Has Been Featured In The 𝐓𝐨𝐩 𝟓𝟎 𝐀𝐒𝐈𝐀𝐍 𝐒𝐓𝐀𝐑𝐒 𝐎𝐅 𝟐𝟎𝟐𝟑. List By @EasternEye, London ❤️🔥.#JrNTR Stands At 25th Position 🔥 & 𝐍𝐓𝐑 Is The Only Actor From Telugu Film Industry In The List 💥💥. pic.twitter.com/E23Cr6zmTj
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) December 21, 2023
Also read: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. కేవలం రూ.48కే నెలాంతా బెనిఫిట్స్!