JP Nadda: జేపీ నడ్డాకు బిగ్ షాక్.. వివాదాస్పద పోస్ట్‌పై సమన్లు జారీ!

బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు కర్ణాటక పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. వివాదాస్పద సందేశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీ రాష్ట్ర యూనిట్ పెట్టిన పోస్ట్‌ అభ్యంతరంగా ఉందంటూ సమన్లు ​​జారీ చేశారు. వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని సూచించారు.

BJP : బీజేపీ రాజ్యసభాపక్ష నేతగా నడ్డా!
New Update

JP Nadda: బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు కర్ణాటక పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. వివాదాస్పద సందేశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీ రాష్ట్ర యూనిట్ పెట్టిన పోస్ట్‌ అభ్యంతరంగా ఉందంటూ సమన్లు ​​జారీ చేశారు. వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని సూచించారు.

జేపీ నడ్డా, ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాలకు సమన్లు..
ఈ మేరకు లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కర్ణాటలకలో ప్రచారం నిర్వహిస్తున్న జేపీ నడ్డా.. బీజేపీ పార్టీపై వివాదాస్పద పోస్ట్ లను ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. అంతేకాదు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా బీజేపీ పార్టీ రాష్ట్ర యూనిట్ పెట్టిన X పోస్ట్‌ అభ్యంతరకరంగా ఉందంటూ కర్ణాటక పోలీసులు జేపీ నడ్డాతోపాటు ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాలకు సమన్లు జారీ చేశారు. బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. విచారణ అధికారి వారికి సమన్లు ​​జారీ చేసి హాజరు కావడానికి వారం రోజుల గడువు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Wine Shops Closed In Telangana: మందు బాబులకు షాక్.. 48 గంటలు వైన్స్ బంద్

ఈ ట్విట్టర్ వీడియోలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల వ్యంగ్య చిత్రాలను కలిగి ఉంది. అలాగే కాంగ్రెస్ ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ హిందువుల నుంచి నిధులు సేకరింఇ ముస్లింలకు మళ్లిస్తోందని బీజేపీ పార్టీ సందేశాన్ని పోస్ట్ చేసింది. అయితే దీనిపై వెంటనే స్పందించిన ఈసీ వెంటనే ఆ వీడియోను తీసివేయాల్సిందిగా ఆదేశించింది.

#karnataka-police #jp-nadda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి