జర్నలిస్టు సౌమ్య హత్య కేసు.. అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు

జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్య కేసులో ఢిల్లీలోని అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నలుగురు దోషులు రవి కపూర్‌, అమిత్‌ శుక్లా, బల్‌జీత్‌ మాలిక్‌, అజయ్‌కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. ఐదో ముద్దాయి అజయ్‌శెట్టికి 3ఏళ్ల జైలుశిక్ష, రూ.7.25 లక్షల జరిమానా విధించింది.

జర్నలిస్టు సౌమ్య హత్య కేసు.. అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు
New Update

జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్య కేసు దేశంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విధులు ముగించుకొని వెళ్తున్న ఆమెపై నలుగురు దుండగులు కాల్పులు జరపగా బుల్లెట్ గాయాలతో ఆమె కారులోనే ప్రాణాలు విడిచారు. 2008 సెప్టెంబర్‌ 30న ఈ సంఘటన జరగగా ఇన్నాళ్లకు ఈ కేసులో తుదితీర్పు వెల్లడించింది ఢిల్లీ అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు. ఈ మేరకు దోషులు రవి కపూర్‌, అమిత్‌ శుక్లా, బల్‌జీత్‌ మాలిక్‌, అజయ్‌కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. ఈ సందర్భంగా గత 14 ఏండ్లుగా వాళ్లు జైలులో ఉంటున్న అంశాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల జరిమానా వేసింది. ఐదో ముద్దాయి అజయ్‌శెట్టికి మూడేండ్ల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.7.25 లక్షల జరిమానా విధించింది. అయితే ఈ మొత్తం జరిమానాను బాధితురాలి కుటుంబానికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇది అరుదైన కేసుల పరిధిలోని రానందున ముద్దాయిలకు మరణ శిక్షను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.

Also read :కొడంగల్లో హైటెన్షన్.. తన్నుకున్న కాంగ్రెస్, బీఆర్​ఎస్ నేతలు

ఇక హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఆంగ్ల న్యూస్‌ ఛానెల్‌ పనిచేస్తున్న సౌమ్య విశ్వనాథన్‌ 2008 సెప్టెంబర్‌ 30వ తేదీ తెల్లవారుజామున విధులు ముగించుకొని దక్షిణ ఢిల్లీలోని నెల్సన్‌మండేలా మార్గ్‌ మీదుగా ఇంటికి వెళ్తుండగా, ఆమెను దోచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఐదుగురు కాల్చి చంపినట్టు విచారణలో రుజువైంది. మహిళా జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీలోని సాకేత్ కోర్టు నలుగురికి జీవితఖైదు విధించింది. మరో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2008లో ఢిల్లీలోని వసంత్ కుంజ్ వద్ద ఈ హత్య జరిగింది. కాగా ఈ కేసులో రవి కపూర్, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అమిత్ శుక్లా లపై హత్యా అభియోగాలను మోపిన ప్రాసిక్యూషన్ విభాగం ఆ అభియోగాలను నిరూపించడంలో సఫలమైంది. అజయ్ సేథీ అనే వ్యక్తిని ఐదో నిందితుడిగా పేర్కొన్నారు. సౌమ్య విశ్వనాథన్ వాహనాన్ని అజయ్ సేథీ అడ్డగించాడని ప్రాసిక్యూషన్ పేర్కొంది. 411 సెక్షన్ కింద అతడు దోషిగా నిరూపణ అయ్యాడు. కాగా నిందితులు ఆమెను దోపిడీ కోసమే హత్య చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఢిల్లీ కోర్టు తీర్పుపై స్పందించిన సౌమ్య విశ్వనాథన్.. ఈ తీర్పు తమకు సంతృప్తి కలిగించిందే తప్పా.. సంతోషం కలిగించలేదన్నారు. తమ కూతురును తలచుకుంటూ కోర్టులోనే భావోద్వేగానికి లోనయ్యారు.

#murder-case #sensational-verdict #soumya
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe