Jos Buttler On MS Dhoni And Virat Kohli: ఐపీఎల్‌లో అద్భుతాన్ని సృష్టించాడు జోస్ బట్లర్ . కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్ తన సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. భారీ స్కోరును ఛేజ్ చేసి కోల్‌కతా చరిత్ర సృష్టించింది. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వారిని ప్రేరణగా తీసుకున్నట్లు జోస్ బట్లర్ తెలిపారు. సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఆ క్రికెటర్లకు ఉందని, వారిని ఆదర్శంగా తీసుకున్నట్లు బట్లర్ తెలిపాడు. రాజస్థాన్ బ్యాటర్ బట్లర్ 60 బంతుల్లో 107 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌కతా రెండు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. విన్నింగ్స్ రన్స్‌ను బట్లర్ స్కోర్ చేశాడు.
ఇంగ్లీష్ బ్యాటర్ బట్లర్ ఓ దశలో నడవడానికి ఇబ్బందిపడ్డాడు. కానీ తనలోని పోరాట పటిమను అతను వదలలేదు. 224 రన్స్‌ను ఛేజింగ్ చేసిన రాజస్థాన్ (Rajasthan Royals) జట్టు 13వ ఓవర్‌లో 121 రన్స్‌కు ఆరు వికెట్లు కోల్పోయింది. కానీ నమ్మకంతో ఇన్నింగ్స్‌ను కొనసాగించినట్లు బట్లర్ చెప్పాడు. రిథమ్ కోసం కొంత తడబడ్డా.. తనకు తానే మళ్లీ నెమ్మదించుకున్నట్లు చెప్పాడు. రిథమ్ మళ్లీ రావాలంటే కొంత శాంతంగా ఉండాలని అనుకున్నట్లు చెప్పాడు.
Also Read: లక్ష్యం ముందు..పేదరికం చిన్నది..సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన బీడీ కార్మికురాలి బిడ్డ..!
ఐపీఎల్‌లో ఎన్నో అద్భుతాలు జరిగాయని, కొన్ని మ్యాచుల్లో క్రేజీగా ఫినిష్ అవుతోందని, ధోనీ.. కోహ్లీ లాంటి ఆటగాళ్లు చివరి వరకు ఆడుతారని, నమ్మకంతో బ్యాటింగ్ చేస్తారని, తాను కూడా అదే చేసేందుకు ప్రయత్నించినట్లు బట్లర్ తెలిపారు. కోచ్ కుమార సంగక్కరకు కూడా క్రెడిట్ ఇచ్చాడు బట్లర్. తనలో నమ్మకాన్ని పెంచేందుకు కోచ్ సంగక్కర ప్రయత్నించినట్లు బట్లర్ పేర్కొన్నాడు. సంగక్కర తనకు ఎంతో చెప్పాడని, ప్రతి దశలోనూ ఓ బ్రేకింగ్ పాయింట్ ఉంటుందని, వికెట్‌ను కోల్పోవద్దు అని సలహా ఇచ్చారని తెలిపాడు.
పిచ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలని, ఏదో ఓ దశలో మూమెంటం మారుతుందని, గత కొన్నేళ్లలో తాను ఇదే నేర్చుకున్నట్లు సంగక్కర చెప్పారని బట్లర్ వెల్లడించాడు. మంగళవారం కోల్‌కతాతో ఆడిన మ్యాచ్ తన ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో ఉత్తమమైందని బట్లర్ పేర్కొన్నాడు. చాలా సంతృప్తిని ఇచ్చిందన్నాడు.
బట్లర్ ఓ ప్రత్యేకమైన ప్లేయర్ అని, అతను ఫామ్‌లో ఉంటే, ఏ టార్గెట్ కూడా సురక్షితం కాదు అని ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపారు. ఈ గెలుపుతో సంతోషంగా ఉందని, వికెట్లు కోల్పోతున్నసమయంలో ఆందోళన చెందామని, రోవ్‌మాన్ పావెల్ కొన్ని సిక్స్‌లు కొట్టాడని, ఆ సయమంలో మళ్లీ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు అనిపించిందని శాంసన్ తెలిపాడు.