Penamaluru: పెనమలూరులో రెచ్చిపోయిన జోగి కుమారుడు..ఉద్రిక్త పరిస్థితులు!

పెనమలూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. ఉప్పులూరు లోని పోలింగ్‌ కేంద్రానికి తన అనుచరులతో కలిసి వచ్చిన రాజీవ్‌, టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.

New Update
Penamaluru: పెనమలూరులో రెచ్చిపోయిన జోగి కుమారుడు..ఉద్రిక్త పరిస్థితులు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏపీలోని ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే పెనమలూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు.

పెనమలూరు నియోజకవర్గంఓని ఉప్పులూరులోని పోలింగ్‌ కేంద్రానికి జోగి రాజీవ్‌ వచ్చారు. ఆయన వెనుక కొందరు కార్యకర్తలు కూడా భారీగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి తెలుసుకున్న స్థానిక నేత బోడే వర్గీయులు సైతం పోలింగ్‌ జరుగుతున్న కేంద్రానికి తరలి వెళ్లారు.

దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి... ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పారు. పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి జోగి రమేష్ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో జోగి రమేష్‌ పెడన నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత సీఎం వైయస్ జగన్ తన రెండోసారి చేసిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జోగి రమేష్‌కు గృహ నిర్మాణ శాఖను కేటాయించారు.అయితే జోగి రమేష్ స్వగ్రామం మైలవరం నియోజకవర్గంలో ఉంది.

Also read:  పీవోను చితకబాదిన గ్రామస్తులు..నిలిచిన పోలింగ్‌!

Advertisment
తాజా కథనాలు