Jogi Ramesh: చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు జోగి రమేష్ AP: గుంటూరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఈరోజు ఆయన్ను గుంటూరు డీఎస్పీ విచారించనున్నారు. ఈ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు జోగి రమేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 16 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Jogi Ramesh: చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజు విచారణకు మంగళగిరి డీఎస్పీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. ఈ కేసుపై ఆయన్ను డీఎస్పీ విచారించనున్నారు. కాగా ఆగస్టు 11న విచారణకు హాజరుకావాలని జోగి రమేష్ కు డీఎస్పీ నోటిసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే.. దాడి సమయంలో వినియోగించిన ముబైల్ ఫోన్, సిమ్ కార్డ్, వెహికల్ తీసుకొని విచారణకు హాజరు కావాలని జోగి రమేష్ కు నోటీసులు అందాయి. 2021 సెప్టెంబర్ 17న చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు జోగి రమేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ వలలో కొడుకు... ఇటీవల అగ్రిగోల్డ్ భూమలు కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) కొడుకు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో 15 మంది ఏసీబీ (ACB) అధికారులు పాల్గొన్నారు. సీఐడీ జప్తులో ఉన్న అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి అమ్మినట్లు ఏసీబీ అధికారుల గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1 గా జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావు, ఏ2 గా జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, ఏ3 గా అడుసుమిల్లి మోహన్ రామ్ దాస్, ఏ4 గా అడుసుమిల్లి వెంకట సీత మహాలక్ష్మి, ఏ5 గా గ్రామ సచివాలయం సర్వేయర్ దేదీప్య, ఏ6 గా మండల సర్వేయర్ రమేష్, ఏ7 గా డిప్యూటీ తాసీల్ధార్ విజయ్ కుమార్, ఏ8 గా మండల తసీల్ధార్ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు అధికారులు. Also Read : నేను విచారం వ్యక్తం చేస్తున్న: కేటీఆర్ #chandrababu #mangalagiri #jogi-ramesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి