/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/jobs-1-jpg.webp)
BECIL Jobs : మీకు డిగ్రీ ఉందా.. అయితే ఈ ఉద్యోగాలు(Jobs) మీకోసమే. డిగ్రీ(Degree) చదివితే చాలు మా సంస్థలో ఉద్యోగాలు చేయొచ్చు అంటోంది బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ లిమిటెడ్(Broadcast Engineering Limited). తమ కంపెనీలో 44 పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ను విడుదల(Notification Released) చేసింది. 34, 362 జీతం... ఆపైన ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయని ప్రకటించింది. దాంతో పాటూ గ్రాఫిక్ డిజైన్, డిజిటల్ డిజైన్ లాంటి వాటిల్లో డిగ్రీ ఉన్నవాళ్ళకు కూడా ఉద్యోగాలున్నాయని చెబుతోంది. వీరికి 50 నుంచి 60 వేల దాకా జీతం ఉంటుందని తెలిపింది. అర్హులైన 40 ఏళ్ళలోపు అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది.
Also Read : Goutam Gambhir : రాజకీయాల నుంచి గౌతమ్ గంభీర్ అవుట్..క్రికెట్‌కే జీవితం అంకితం
దరఖాస్తు...
బీఈసీఐఎల్(BECIL) లో ఉద్యోగాలకు అప్లే చేసుకోవాలనుకునేవారు BECIL అధికారిక వెబ్ సైట్‌లో అప్లై చేసుకోవాలి. అక్కడ అభ్యర్ధి అన్ని వివరాలను పూర్తి చేసి , డాక్యుమెంట్లను కూడా సబ్ మిట్ చేయాలి. ఆ తరువాత ఫీజును కూడా చెల్లించి సబ్ మిట్ చేయాలి.
ఫీజు...
బీఈసీఐఎల్‌లో ఉద్యోగాల దరఖాస్తకు చెల్లించాల్సిన ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజింగ్ వాళ్ళు అయితే 531 రూ... జనరల్, ఓబీసీ, మాజీ-సర్వీస్‌మెన్, మహిళలు అయితే 885 రూ. చెల్లించాలి. ఈ షీజులను కేవలం ఆన్లైన్ లోనే చెల్లించాలి. రుసుము చెల్లించాక రిసీప్ట్‌ను మాత్రం తప్పనిసరిగా భద్రపరుచుకోవాలని చెబుతున్నారు. పూర్తి విరాల కోసం బీఈసీఐఎల్ వెబ్‌సైట్‌ను వీక్షించండి.
Also Read : FASTAG : ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ అప్డేట్ గడుపు పొడిగింపు