DA Hike: ఉద్యోగులకు మోదీ సర్కార్ దసరా శుభవార్త.. 4 శాతం డీఏ పెంపు
దేశమంతా దసరా సందడి ప్రారంభమైన వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది మోదీ సర్కార్. 4 శాతం డీఏ పెంపును ప్రకటించింది.
దేశమంతా దసరా సందడి ప్రారంభమైన వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది మోదీ సర్కార్. 4 శాతం డీఏ పెంపును ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. 3,282 ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఉన్న 18 యూనివర్సిటిల్లో మొత్తం 3, 282 అధ్యాపక పోస్టుల భర్తీకి అక్టోబర్ 20న ప్రకటన వెలువరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కే. హేమచంద్రారెడ్డి తెలిపారు. వీటితోపాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్ పై తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
తెలంగాణలో 8, 180 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిజల్ట్స్ మెరిట్ లిస్టును విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ రెడీ అయ్యింది. ఈ ఏడాది జులై 1న రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 7.6లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన తుది కీని కూడా వెల్లడించింది. దసర పండగా తర్వాత మెరిట్ జాబితాను ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టత ఇచ్చిన తర్వాతే ఎన్నికల కోడ్ తర్వాత 1:2 నిష్పత్తి ప్రకారం ఫైనల్ లిస్టును ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై స్పష్టత కోసం మరింత సమయం ఆగాల్సిందే.
ఐటీ ఉద్యోగులకు ప్రతిరోజూ ఓ గండంలా గడుస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో..ఎప్పుడు ఊడుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. తెల్లవారితే ఉద్యోగం ఉంది...హమ్మయ్య అని అనుకునే పరిస్థితి నెలకొంది. దీనికి కారణాలు ఉన్నాయి. ప్రపంచం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొ్ంటున్న క్రమంలో బడా, చోటా కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ప్రాజెక్టులు తక్కువగా రావడం...కొత్త ప్రాజెక్టులపై ఆశలు లేకపోవడం వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిగంటకు ప్రపంచవ్యాప్తంగా 23మంది ఐటీ ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఐటీ కంపెనీలకు ఏ చిన్న విషయం కనిపించినా..ఉద్యోగులకే కాకకుండా దేశఆర్ధిక వ్యవస్థకు పెద్ద సవాల్ గా మారుతోంది. గంటకు 23మంది ఉద్యోగులు అంటే..మామూలు విషయం కాదు. 24గంటల్లో 552 మంది..అంటే నెలకు 30నరోజుల్లో 16వేల 560మంది ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోతున్నారు.
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా ఈ కంపెనీల్లో వెయ్యికి పైగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మెగా జాబ్ మేళాను అక్టోబర్ 20వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 9.00గంటల నుంచి నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో సెలక్ట్ అయిన అభ్యర్థులు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
ఐడీబీఐ...ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 600 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పరీక్ష, ఇంటర్వ్యూలతో రిక్రూట్ జరుగుతుంది. ఇందులో సెలక్ట్ అయిన వారు ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. అందులో రాణించినవారిని విధుల్లోకి చేర్చుకుంటారు. కోర్సులో ప్రతి నెలా స్టైఫెండ్ కూడా ఇస్తారు. అంతేకాదు ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదికి 6.5లక్షలు వేతనంగా చెల్లిస్తారు.
ఏపీ (AP) ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్-ఏపీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పిలుపునిచ్చింది.
భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో.. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 13లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఏపీలో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలు పూర్తయ్యాయి. పేపర్ 3,4 పరీక్షల ప్రశ్నపత్రాలతో సహా.. ప్రాథమిక కీ లను ఏపీ ఎస్ఎల్పీఆర్బీ (APSLPRB) విడుదల చేసింది. అలాగే సమాధానాలకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత ఫార్మాట్లో మెయిల్‌కు పంపాలని తెలిపింది. ప్రశ్నా పత్రాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.