Telangana: తెలంగాణ డీఎస్సీ వాయిదా.. మళ్లీ పరీక్ష ఎప్పుడంటే..
తెలంగాణలో డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. నవంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
తెలంగాణలో డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. నవంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
ఏపీలో ఇంటర్ పూర్తి చేసినవారికి గుడ్ న్యూస్. ఇంటర్ ఏ గ్రూప్ అయినా సరే ఉత్తీర్ణసాధించినవారికి నర్సింగ్ చేసేందుకు ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇది కేవలం ఉమ్మడి కర్నూలు జిల్లాకు మాత్రమే వర్తిస్తుంది. ఈ జిల్లాలో ఇంటర్ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు నర్సింగ్ చేసే ఛాన్స్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వ ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీ నరసయ్య తెలిపారు. ఇంటర్ పూర్తి చేసి నర్సింగ్ చేయాలనుకుంటున్న వారికి ఏఎన్ఎం రెండేళ్ల కోర్సుకు సంబంధించి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి్ంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు తెలుగు, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత కలిగి ఉంటారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఏపీలో ఎస్ఐ నియామకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ప్రభుత్వం నిబంధనలు పాటించని కారణంగా అనేక మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పరీక్షలను తత్కాలికంగా వాయిదా వేయాలని కోరారు. అయితే.. ఈ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
ఏపీలో త్వరలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు బొత్స.
తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ చదివిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కేసీఆర్ సర్కార్. రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ అభ్యర్థులతోపాటుగా బీటెక్ తో బీఈడీ చేసిన అభ్యర్థులందరూ టీచర్లు కావచ్చంటూ వెల్లడించింది. బీటెక్, బీఈతో బీఈడీ చేసిన అభ్యర్థులకు డీఎస్సీ 2023లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజికల్స్ సైన్స్ పోస్టులకు వీరు పోటీ పడొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులను జారీ చేశారు.
ఎయిమ్స్ భోపాల్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 233 గ్రూప్-సి నాన్ ఫ్యాకల్టీ పోస్టులను రిక్రూట్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు, గేట్ 2024 కోసం కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియను ఈ రోజు అంటే 12 అక్టోబర్ 2023న ముగించనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.
క్రికెట్ అంపైర్లుకు ఇటివలీ కాలంలో జీతాలు ఎక్కువగానే పెరిగాయి. ముఖ్యంగా ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ. 1.98 లక్షల ఫీజ్ అందుకుంటారు ఎలైట్ అంపైర్లు. ఇక ఇండియాలో అంపైర్ అవ్వాలంటే బీసీసీఐ పెట్టే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. లెవల్ 1, లెవెల్ 2 రెండు పరీక్షలను క్లియర్ చేయాలి. అభ్యర్థులు తప్పనిసరిగా మెడికల్ టెస్ట్‌కు హాజరు కావాలి.