TGPSC: బీసీ బిడ్డగా చెబుతున్నా.. గ్రూప్-1పై టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన

గ్రూప్-1 ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ లో ఒక్క బీసీ బిడ్డకు కూడా అన్యాయం జరగనివ్వమని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఓ బీసీ బిడ్డగా ఇది తాను ఇస్తున్న భరోసా అన్నారు. BJP, BRS నేతలు కుమ్మక్కై అభ్యర్థుల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.

TGPSC Bomma Mahesh Kumar Goud
New Update

గ్రూప్-1 పరీక్ష విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీసీ బిడ్డగా అభ్యర్థులందరినీ తాను భరోసా ఇస్తున్నానన్నారు. సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడా.. రిజర్వుడు కేటగిరీకి అన్యాయం జరగదన్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం నుంచి ఈ భరోసా ఇస్తున్నామన్నారు. జీఓ 29 తో నష్టం అనేది కేవలం అపోహ మాత్రమేనన్నారు. బీఆర్ఎస్ నియామకాల పేరుతోనే అధికారంలోకి వచ్చిందన్నారు. పదేళ్లలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: భారీ బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్.. యాక్షన్ లోకి 144 సెక్షన్!

బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉందా?

పదేళ్లలో పట్టుమని 35 వేల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇంటర్ ఫలితాలు కూడా సరిగా ఇవ్వలేని మీరు మా గురించి మాట్లాడుతారా? అని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. పది నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ కు నియామకాలపై కమిట్మెంట్ ఉందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఒక్క గ్రూప్-1 ఉద్యోగం అయినా ఇచ్చిందా? అని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ధర్నా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. 
ఇది కూడా చదవండి: దీపావళికి కొత్త రెవెన్యూ చట్టం.. ప్రభుత్వానికి చేరిన దస్త్రం

ఇదిలా ఉంటే.. తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. పరీక్ష వాయిదా వివాదం నడుస్తున్న వేళ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు అక్టోబర్ 21 నుంచి 27 వరకు 46 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: దీపావళికి కొత్త రెవెన్యూ చట్టం.. ప్రభుత్వానికి చేరిన దస్త్రం

ఇది కూడా చదవండి: కూల్చివేతలపై హైడ్రా సంచలన ప్రకటన

#government-jobs #tspsc-group-1 #ap-group-1-exams
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe