41,500 రైల్వే ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ షెడ్యూల్ వెల్లడి

41,500 ఖాళీల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షల తేదీలను ఆర్‌ఆర్‌బీ వెల్లడించింది. నవంబర్ 25 నుంచి డిసెంబరు 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అసిస్టెంట్ లోకోపైలట్, RPF ఎస్ఐ, జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టుల పరీక్షలున్నాయి.

Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్‌పై కీలక ప్రకటన!
New Update

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా రైల్వే జోన్లలో మొత్తం 41,500 ఖాళీలను భర్తీ చేయనుంది. అందులో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు - 18,799, ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ పోస్టులు -452,  టెక్నీషియన్‌ పోస్టులు- 14,298, జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు- 7,951 ఉన్నాయి. అయితే ఇందులో అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పీఎఫ్ ఎస్ఐ, జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు గడువు ఇప్పటికే పూర్తయింది. టెక్నీషియన్‌ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 

ఈ పోస్టులకు ఎగ్జామ్ డేట్ ఖరారు

తాజాగా ఈ 41,500 ఖాళీల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షల తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను అందుబాటులో ఉంచింది. నవంబర్ 25 నుంచి డిసెంబరు 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అందులో అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలు నవంబరు 25 నుంచి 29 మధ్య జరగనున్నాయి.

ఇది కూడా చదవండిః వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టులు.. మరో వారం రోజులే

అదే సమయంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఎస్ఐ పోస్టులకు డిసెంబరు 2 నుంచి 5 వరకు పరీక్షలు జరగనున్నాయి. జూనియర్ ఇంజినీర్ పోస్టులకు డిసెంబరు 6 నుంచి 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక టెక్నీషియన్ పోస్టులకు డిసెంబరు 16 నుంచి 26 మధ్య పరీక్షలు జరగనున్నాయి. అయితే పారామెడికల్‌, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌, ఎన్‌టీపీసీ పోస్టులకు ఎగ్జామ్ డేట్స్ ఇంకా ప్రకటించలేదు. 

Also Read :  మూలా నక్షత్రంలో సరస్వతి దేవీ అవతారంలో అమ్మవారు.. పోటెత్తిన భక్తులు

#railway-jobs #rrb #job-notification
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe