రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. ఇక అప్లై చేసుకోవాలంటే పోస్ట్ గ్రాడ్యూయేట్ కోర్స్ చేసి ఉండాలి. మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్, లా, కామర్స్, ఎకనామిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ విభాగాల్లో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేసి ఉండాలి. న్యాయ శాస్త్రంలో పొఫెషనల్ బ్యాచిలర్ డిగ్రీ ఫుల్ టైం చేసి ఉండాలి.
Also Read : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టులు.. అర్హులు ఎవరంటే?
రిజర్వ్ బ్యాంక్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం కేవలం 125 మంది విద్యార్థులను మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌కు ఆర్‌బీఐ ఎంపిక చేస్తుంది. సమ్మర్‌లో ఈ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. జనవరి, ఫిబ్రవరీ నెలల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అన్ని విభాగాల్లో అర్హత సాధించిన విద్యార్థుల పేర్లను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. ఇలా ఛాన్స్ వచ్చిన వాళ్లకు నెలకు రూ.20,000 స్టైఫండ్ పొందే సువర్ణావకాశం ఉంది.
Also Read : స్కిల్ యూనివర్సిటీ ప్రవేశాలకు దరఖాస్తులు.. లాస్ట్ డేట్ ఇదే!