/rtv/media/media_files/2026/01/24/ai-2026-01-24-21-46-59.jpg)
టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏజెంటిక్ ఏఐ గురించే చర్చ జరుగుతోంది. నార్మల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఇది మరింత లేటెస్ట్ రూపం. అంతర్జాతీయ వర్క్‌ఫోర్స్ సొల్యూషన్ల సంస్థ 'క్వెస్ కార్ప్' తన తాజా నివేదికలో భారత్‌లో ఈ రంగంలో రాబోతున్న ఉద్యోగ విప్లవం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఏజెంటిక్ AI
సాధారణ AI మనం అడిగిన దానికి సమాధానం ఇస్తే, ఏజెంటిక్ ఏఐ ఒక అడుగు ముందుకేసి స్వయంప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటుంది. పనులను పూర్తి చేయడానికి అవసరమైన చర్యలను తానే చేపడుతుంది. ఈ మార్పు కారణంగానే కంపెనీలు ఇప్పుడు కేవలం 'చాట్ బాట్స్' నుంచి 'ఏఐ ఏజెంట్స్' వైపు మొగ్గు చూపుతున్నాయి.
క్వెస్ కార్ప్ సుమారు 28,000 ఉద్యోగ పోస్టింగ్‌లను విశ్లేషించి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం..
ఉద్యోగ గిరాకీ: ఏటా ఈ కొలువుల సంఖ్య 35-40% పెరిగే అవకాశం ఉంది. అయితే, తగిన నైపుణ్యాలున్న అభ్యర్థుల కొరత మాత్రం 50% పైగా ఉండటం గమనార్హం.
మార్కెట్ విలువ: 2024లో భారత్‌లో ఈ మార్కెట్ విలువ రూ.2,500 కోట్లు కాగా, 2030 నాటికి ఇది రూ.31,500 కోట్లకు చేరుతుందని అంచనా.
వేతనాలు: సీనియర్ ఆర్కిటెక్చర్, సేఫ్టీ విభాగాల్లో పనిచేసే వారికి వేతనాలు 20-28% వరకు పెరుగుతున్నాయి.
పని విధానం: దాదాపు 15-20% ఉద్యోగాలకు 'ఇంటి నుంచే పని' సౌకర్యాన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి.
కొత్తగా పుట్టుకొస్తున్న ఉద్యోగాలు
మూడేళ్ల క్రితం వరకు వినిపించని కొత్త రకం ఉద్యోగ హోదాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి:
ఏఐ ఆర్కిస్ట్రేషన్ ఇంజినీర్లు
ఏజెంట్ బిహేవియర్ అనలిస్ట్‌లు
వెక్టర్ డేటాబేస్ ఆర్కిటెక్ట్‌లు
ఏజెంట్ సేఫ్టీ & గవర్నెన్స్ స్పెషలిస్ట్‌లు
హైదరాబాద్, బెంగళూరుల హవా
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏజెంటిక్ ఏఐ నియామకాల్లో 62% కేవలం బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాల్లోనే జరుగుతున్నాయి. అంటే దక్షిణ భారతదేశం ఏఐ విప్లవానికి కేంద్రబిందువుగా మారింది. ద్వితీయ శ్రేణి నగరాలైన కోచి, కోయంబత్తూర్, జైపూర్ వంటి ప్రాంతాల వాటా 10 శాతంగా ఉంది.
నియామకాల్లో మార్పులు
ప్రస్తుతం జరుగుతున్న నియామకాల్లో 70% మంది మధ్య-స్థాయి సీనియర్ నిపుణులే ఉంటున్నారు. గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల (GCC) నుంచే 54% డిమాండ్ వస్తోంది. నైపుణ్యం గల అభ్యర్థుల కొరతను అధిగమించడానికి 75% పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకు సొంతంగా ఏఐ శిక్షణను ఇస్తున్నాయి.
టెక్నాలజీ నిపుణులకు ఏజెంటిక్ ఏఐ అనేది కేవలం ఒక నైపుణ్యం మాత్రమే కాదని, అది ఒక అద్భుతమైన కెరీర్ అని క్వెస్ కార్ప్ ఐటీ స్టాఫింగ్ సీఈఓ కపిల్ జోషి పేర్కొన్నారు.
Follow Us