/rtv/media/media_files/2025/06/01/xEBHoXPg9sxcL7dEG2yJ.jpg)
Navodaya Admissions 2025
Navodaya Admissions 2025: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయడానికి విద్యార్థులకు జూలై 29, 2025 వరకు గడువు ఉన్నది. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న లేదా ఐదో తరగతిని పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉన్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 654 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి.
ఈ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల ఎంపికను రెండు విడతలుగా జరిగే పరీక్షల ఆధారంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించబడుతుంది. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన తేదీలు, పరీక్ష విధానం వంటి ఇతర వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అప్లికేషన్ విధానం:
జవహర్ నవోదయ అధికారిక వెబ్ సైట్ https://cbseitms.rcil.gov.in/nvs/? లోకి వెళ్లాలి.
హోమ్ పేజీలో జేఎన్‌బీఎస్‌టీ 6వ తరగతి రిజిస్ట్రేషన్ (2026-27) లింక్‌పై క్లిక్ చేయాలి.
ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేసి పూర్తి వివరాలను ఎంట్రీ రిజిస్ట్రేషన్‌లో నిప్పాలి.
రిజిస్ట్రేషన్ వివరాలతో అకౌంట్‌లోకి లాగినై అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి.
లాస్ట్‌లో సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. ఇలా చేస్తే అప్లికేషన్ విధానం పూర్తవుతుంది.
రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ ఫ్రింట్ తీసుకోవాలి.
పరీక్ష తేదీ:
ఈ పరీక్ష రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో డిసెంబర్ 13 2025వ తేదీన పరీక్ష జరుగుతుంది. శనివారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 01.30 గంటల వరకు ఉంటుంది. జమ్మూ కశ్మీర్ సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన జరగుతుంది.
ఇది కూడా చదవండి: సప్లిమెంట్స్ తీసుకోవడం అవసరమా లేదా? మాత్రలు సమతుల్య ఆహారాన్ని భర్తీ చేస్తాయా?
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు:
ఆధార్ కార్డు
క్యాస్ట్ సర్టిఫికెట్
పుట్టిన సర్టిఫికెట్
ఇన్కామ్ సర్టిఫికెట్
మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్
రెసిడెన్స్ సర్టిఫికెట్
టీసీ
మైగ్రేషన్ సర్టిఫికెట్
దివ్యాంగ విద్యార్థులైతే సంబంధిత సర్టిఫికెట్
అభ్యర్థి హెడ్ మాస్టర్ ధృవీకరించిన సర్టిఫికేట్
Online Form released for class VI admission (Jawahar Navodaya Vidyalaya selection test) JNVST : 2026-27 pic.twitter.com/lHEaUDJvei
— Lt Lakhan Singh Rana (@LakhanS43877493) May 31, 2025
పరీక్షా విధానం :
నవోదయ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 80 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ నుంచి 40, అర్థమెటిక్ నుంచి 20 , లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.
ఇది కూడా చదవండి: ఏపీలో విషాదం.. అనుమానంతో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త