/rtv/media/media_files/2025/02/22/WGYHQMskWw7HBC2Qms4m.jpg)
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 246 పోస్టుల భర్తీకి గడువు పొడిగించింది. ఫిబ్రవరి 23తో ముగియాల్సిన గడువును మరో ఐదు రోజులు అంటే ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించింది. ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపింది. జూనియర్ ఆపరేటర్ 215 పోస్టులు, జూనియర్ అటెండెంట్ 23 పోస్టులు, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Also Read : లక్ష కోట్లు పోగొట్టుకున్న అదానీ..అధిక సంపద కోల్పోయిన వారిలో సెకండ్
ఉద్యోగాన్ని భట్టి.. రూ. 23,000 నుంచి రూ. 1,05,000 వరకకు జీతం ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితిని డీటెయిల్డ్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.దరఖాస్తు ఫీజు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజను డెబిట్ కార్డులు (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లించవచ్చు.
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు.. గరిష్ట వయోపరిమితి: 26 సంవత్సరాలు (31-01-2025 నాటికి)
Also read : విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త...ఇకపై ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు
ఎలా దరఖాస్తు చేయాలి
అధికారిక వెబ్‌సైట్ iocl.comకు వెళ్లండి
హోమ్‌పేజీలో ఉన్న రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి అనే లింక్‌పై క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన దరఖాస్తు రుసుము చెల్లించండి.
తదుపరి అవసరాల కోసం దరఖాస్తును సేవ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.
దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది
Also Read : కోహ్లీని భయపెడుతున్న పాక్ స్పిన్నర్... ఇంతకీ ఎవరితను?
Also Read : నేనలా అనలేదు..తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఛావాపై వివరణ ఇచ్చిన స్వర భాస్కర్!