ఈసీహెచ్‌ఎస్‌- సికింద్రాబాద్‌లో ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా?

సికింద్రాబాద్‌లోని ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ (ఈసీహెచ్‌ఎస్) గుడ్ న్యూస్ చెప్పింది. ఒప్పంద ప్రాతి పదికన పారా మెడికల్, మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 102 పోస్టులను భర్తీ చేస్తుంది.

New Update
ECHS

సికింద్రాబాద్‌లోని ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ (ఈసీహెచ్‌ఎస్) గుడ్ న్యూస్ చెప్పింది. ఒప్పంద ప్రాతి పదికన పారా మెడికల్, మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 102 పోస్టులను భర్తీ చేస్తుంది. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సెలక్ట్ అయిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించాలి. 

వివిధ విభాగాల్లో ఖాళీలు

ఓఐసీ పాలీక్లినిక్ - 6, మెడికల్ స్పెషలిస్ట్ - 3, మెడికల్ ఆఫీసర్ - 24, గైనకాలజిస్ట్ - 1, డెంటల్ ఆపీసర్ - 8, డెంటల్ హైజనిస్ట్ - 3, ఫార్మాసిస్ట్ - 12, ల్యాబ్ టెక్నీషియన్ - 7, ల్యాబ్ అసిస్టెంట్ - 1, నర్సింగ్ అసిస్టెంట్ - 3, ఫిజియోథెరపిస్ట్ - 3, ఐటీ నెట్వర్క్ టెక్నీషియన్ - 1, ఫిమేల్ అటెండెంట్ - 2, చౌకీదార్ -6, డ్రైవర్ - 5, సఫాయివాలా - 9, క్లర్క్ -5, డీఈఓ- 2, ప్యూన్ -1 పోస్టులున్నాయి. 

ఇది కూడా చదవండి: విజయవాడ లోకో పైలట్‌ను అందుకే చంపేశా.. విచారణలో షాకింగ్ నిజాలు!

8వ తరగతి, పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్, బీఎస్సీ డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్/ బీడీఎస్/ బీఫార్మసీ/ జీఎన్ఎం/ ఎండీ/ ఎంఎస్ లలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. నెలకు ఓఐసీ పాలీక్లినిక్, డెంటల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.75,000 చెల్లిస్తారు.

ఇది కూడా చదవండి: విచిత్రం.. ఎడారిలో పోటెత్తిన వరదలు.. భవిష్యత్తులో జరిగే పరిణామాలు..

అలాగే మెడికల్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ పోస్టులకు నెలకు రూ.1,00,000 చెల్లిస్తారు. క్లర్క్, ప్యూన్, డీఈఓ, టెక్నీషియన్, సఫాయివాలా, అటెండెంట్, చౌకీదార్ పోస్టులకు నెలకు రూ16,800 చెల్లిస్తారు. డ్రైవర్ పోస్టులకు నెలకు రూ.19,700, మిగతా పోస్టులకు నెలకు రూ.28,100 చెల్లిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 20, 2024లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు