Bank Jobs: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పూణే ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో మొత్తం 600 అప్రెంటిస్ పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
600 ఖాళీలు
ఇది కూడా చదవండి: మద్యం షాపులకు లాటరీ.. ఎన్నో చిత్ర విచిత్రాలు బాబోయ్, ఆశ్చర్యపోతారు!
ఎస్సీ - 65
ఎస్టీ - 48
ఓబీసీ - 131
ఈడబ్ల్యూఎస్ - 51
యూఆర్ - 305 ఖాళీలున్నాయి.
ఏపీ/ తెలంగాణ
ఇది కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం.. హరీష్ రావు సీరియస్ రియాక్షన్
ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకు శాఖల్లో 11 పోస్టులు
తెలంగాణలోని బ్యాంకు శాఖల్లో 16 ఖాళీలు ఉన్నాయి.
అర్హత:
ఆసక్తి గల అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ సాధించి ఉండాలి.
ఇది కూడా చదవండి: పోకో కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్!
శిక్షణ
ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
వయసు
జూన్ 30, 2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 - 15 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక
ఇది కూడా చదవండి: ఐఫోన్ 13, 14, 15లపై ఆఫర్ల జాతర.. ఇప్పుడు మిస్ అవ్వొద్దు!
12వ తరగతి (హెచ్ఎస్‌సీ/ 10+2)/ డిప్లొమా మార్కులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ సహా తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 14.10.2024
ఆన్‌లైన్ దరఖాస్తు ఆఖరు తేదీ: 24.10.2024