Tirupathi: తిరుపతిలో మూడు రోజుల పాటూ మహా శాంతి యాగం‌‌–టీటీడీ నిర్ణయం

తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆగమపండితులతో టిటిడి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. లడ్డులో కల్తీ నెయ్యి వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు మహా శాంతి యాగం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.

author-image
By Manogna alamuru
New Update
ttd

TTD Board: 

తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆగమపండితులతో టిటిడి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. లడ్డులో కల్తీ నెయ్యి వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు మహా శాంతి యాగం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ యాగం వల్ల శ్రీవారి ఆలయంలో జరిగే పలు సేవల రద్దు చేయనున్నారు. శ్రీవారి ఆలయంలోనే యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. అయితే ఎప్పటి నుంచి యాగం నిర్వహించాలన్న అంశంపై ఇంకా ఒక కొలిక్కి మాత్రం రాలేదు. దీనిపై రేపు మారోమారు ఆగమ కమిటీ సమావేశం అవనుంది. దీని తర్వాత రేపు సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

Also Read: Sharmila: లడ్డూ వివాదంపై సీబీఐ ఎంక్వైరీ వేయండి‌‌–పీసీసీ ఛీఫ్ షర్మిల

Advertisment
తాజా కథనాలు