/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Job-Mela-in-Nandyal-jpg.webp)
Job Mela in AP: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళాకు (Job Mela) సంబంధించిన ప్రకటన విడుదలైంది. నంద్యాలలో (Nandyala) ఈ నెల 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 750 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
Japanese Automobiles Pvt Ltd: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ ఆపరేటర్స్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.17,350 వేతనంతో పాటు పీశ్రీఫ్, ఈఎస్ఐ, క్యాంటీన్, బస్ సదుపాయం ఉంటుంది. ఎంపికైన వారు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
TATA Electronics: ఈ సంస్థలో 500 ఖాళీలు ఉన్నాయి. మొబైల్ అసెంబ్లిగ్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,750 వేతనం ఉంటుంది. ఫ్రీ ఫుడ్, ట్రాన్స్ పోర్ట్, యూనిఫామ్, షూస్ అందిస్తారు. ఎంపికైన వారు Housur లో పని చేయాల్సి ఉంటుంది.
Hetero Drugs: జూనియర్ కెమిస్ట్/ఆపరేటర్, టెక్నీషియన్, QA/QC విభాగాల్లో 50 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
@AP_Skill has Conducting Mini Job Mela at G.T.R.M Government Degree College #Yerraguntla #NandyalDistrict
Registration Linkhttps://t.co/BABXylsBXT
Contact
K. Subbanna - 9440224291
Madav - 9701303790
APSSDC Helpline - 9988853335 pic.twitter.com/3nuNPLzGLK— AP Skill Development (@AP_Skill) December 12, 2023
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 19న ఉదయం 9 గంటలకు జీటీఆర్ఎం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఎర్రగుంట్ల చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.