/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-09T133420.284-jpg.webp)
Chittoor : ఏపీ(AP) రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త(Good News To Un-Employees) చెప్పంది. ఎగ్జామ్స్ లేకుండానే 100 కంపెనీలల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా(Chittoor District) కేంద్రంలోని విజ్ఞానసుధ డిగ్రీ కాలేజీ(Vignana Sudha Degree College) లో ఫిబ్రవరి 15న రీజినల్ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు.
10 నుంచి పీజీ..
ఈ మేరకు కలెక్టరేట్‌లో బుధవారం జాబ్‌మేళా(Job Mela) పోస్టర్‌లను ఆవిష్కరించిన కలెక్టర్.. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి గ్రామం, వార్డు సచివాలయాల్లో అర్హత కలిగిన నిరుద్యోగులకు జాబ్‌మేళాకు సంబంధించిన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిని పాస్, ఫెయిల్ తో సంబంధం లేకుండానే ఇందులో పాల్గొనవచ్చని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి : Hyderabad:రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య.. మర్మాంగాలు కోసి
18 నుంచి 35..
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. ఇతర వివరాలకు 9063561786, 9493210966, 8142509017 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్యాంమోహన్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు.