Jharkand: ఝార్ఖండ్​ సీఎంగా హేమంత్​ సోరెన్​ ప్రమాణ స్వీకారం..

జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధ్యక్షుడు, మాజీ సీఎం హేమంత్ సోరెన్‌.. 13వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధా కృష్ణన్ ఆయన చేత ప్రమాణం చేయించారు.

Jharkand: ఝార్ఖండ్​ సీఎంగా హేమంత్​ సోరెన్​ ప్రమాణ స్వీకారం..
New Update

జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధ్యక్షుడు, మాజీ సీఎం హేమంత్ సోరెన్‌.. 13వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధా కృష్ణన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఇటీవల హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే.  బుధవారం ఉదయం జేఎమ్‌ఎమ్ సారథ్యంలో కూటమి ఎమ్మెల్యేలందరూ ప్రస్తుత సీఎం చంపయూ సోరెన్ ఇంట్లో సమావేశమయ్యారు. ..  ఆ తర్వాత హేమంత్‌ సోరెన్‌ను సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు హేమంత్‌ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు చంపయూ సోరెన్‌.. గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. దీంతో తాజాగా ఇప్పుడు హేమంత్ సోరెన్‌ ఝూర్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇదిలాఉండగా.. ఝార్ఖండ్ రాజధాని అయిన రాంచీలో 8.86 ఎకరాలకు సంబంధించి భూ కుంభకోణంలో హేమంత్‌ సోరెన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అప్పుడు సీఎంగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ అరెస్టు చేశారు. అధికారిక రికార్డులను తారుమారు చేయడం, కల్పిత లావాదేవీలు, ఫేక్‌ డాక్యుమెంట్లతో కోట్లాది రూపాయల విలువైన భూములను దక్కించుకుని అక్రమంగా ఆదాయంగా పొందారని ఈడీ అభియోగాలు మోపింది. దీంతో ఈ కేసులో బెయిల్‌ కోసం హేమంత్‌ కోర్టులను ఆశ్రయించారు. అయినప్పటికీ ఆయనకు ఉపశమనం లభించలేదు.

Also Read: మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

ఎట్టకేలకు ఇటీవల ఆయనకు ఝార్ఖండ్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో అయిదు నెలల తర్వాత జూన్‌ 28న హేమంత్ సోరెన్ జైలు బిర్సా ముండా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జనవరిలో హేమంత్‌ను ఈడీ అరెస్టు చేయడానికి ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన అరెస్టు అనంతరం.. ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్‌ 12వ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే హేమంత్ సోరెన్‌కు ఝూర్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఈడీ ఖండించింది. ఈ నేపథ్యంలో హేమంత్‌ బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

#hemanth-soren #jharkand #jmm
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe