Justice Abhijit Gangopadhyay: నేను రాజీనామా చేస్తున్నా...హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం..! కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, భారత ప్రధాన న్యాయమూర్తికి పంపుతానని ఆదివారం స్థానిక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. By Bhoomi 03 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Justice Abhijit Gangopadhyay: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జస్టిస్ గంగోపాధ్యాయ రాష్ట్రంలో స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్ వంటి సున్నితమైన కేసులను విచారించారు. తన రాజీనామాను మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపుతానని, దాని కాపీలను భారత ప్రధాన న్యాయమూర్తికి, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపుతానని ఆదివారం స్థానిక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు విలేకర్లు. అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. వెస్ట్ బెంగాల్లో విద్యాకు సంబంధించి ఈ మధ్యే ఆయన ఇచ్చిన తీర్పులు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మార్చి 5న రాజీనామా చేస్తున్నాను. న్యాయమూర్తిగా సోమవారం నాకు చివరి రోజు. నేను ఎలాంటి తీర్పును చెప్పను అంటూ జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ వెల్లడించారు. జస్టిస్ గంగోపాధ్యాయ ప్రస్తుతం కార్మిక వ్యవహారాలు, పారిశ్రామిక సంబంధాలకు సంబంధించిన కేసులను విచారిస్తున్నారు. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, అవినీతి ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్: రాష్ట్రం చాలా అధ్వాన్నమైన దశలో ఉందని ఆయన అన్నారు. ఇక్కడ దొంగతనం, దోపిడీల ప్రస్థానం సాగుతోందని ఫైర్ అయ్యారు. బెంగాలీ అయిన నేను దీన్ని అంగీకరించలేను. "ప్రస్తుత రాష్ట్ర పాలకులు ప్రజలకు ఏ మంచి పని చేయగలరని నేను అనుకోను."పాలక వ్యవస్థ తనకు ఇచ్చిన ఛాలెంజ్ ఈ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించిందని అన్నారు. ఈ ఛాలెంజ్‌పై అధికార పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ఆయన అన్నారు. 2018లో కలకత్తా హైకోర్టు జడ్జిగా: జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ 2018లో కలకత్తా హైకోర్టులో చేరారు. అతను వచ్చే 5 నెలల్లో అంటే ఆగస్టు 2024లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది జనవరిలో, జస్టిస్ గంగోపాధ్యాయ తన సహచర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమెన్ సేన్‌తో న్యాయపరమైన వివాదాన్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. పశ్చిమ బెంగాల్‌లోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల సందర్భంగా కుల ధ్రువీకరణ పత్రాల కుంభకోణం, అవకతవకలపై సీబీఐ విచారణపై స్టే విధించడంపై ఇద్దరు న్యాయమూర్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్: కాగా, పశ్చిమ బెంగాల్‌లో చాలా చర్చనీయాంశమైన టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసులో టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ పాత్రపై స్థానిక బెంగాలీ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా వివాదాన్ని సృష్టించింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా ఘాటు వ్యాఖ్య చేయడంతో పాటు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే హక్కు సిట్టింగ్ జడ్జీలకు లేదన్నారు. ఇది కూడా చదవండి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ..భక్త జనసంద్రంగా మారిన శ్రీశైలం..! #bjp #west-bengal #election-2024 #calcutta-high-court #abhijit-gangopadhyay #lok-sabha-elections-2024-meeting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి