JioTV Premium Plans : జియోటీవీ యూజర్లకు గుడ్ న్యూస్.. సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌ తో 14 ఓటీటీలు..! పూర్తి వివరాలివే..

ప్రముఖ టెలికామ్ సంస్థ జియో.. జియో టీవీ ప్రీమియం పేరుతో కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభించింది. జియో ప్రీపెయిడ్ యూజర్స్ ఒకేసారి 14 ఓటీటీలను సింగిల్ ప్లాన్ లో వినియోగించుకునేలా ఈ జియో టీవీ ప్రీమియం ఉపయోగపడనుంది.ఈ నెల 16 తేదీ నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి రానుంది.

JioTV Premium Plans : జియోటీవీ యూజర్లకు గుడ్ న్యూస్..  సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌ తో 14 ఓటీటీలు..! పూర్తి వివరాలివే..
New Update

Good News For Jio Users : ఓటీటీ(OTT) ప్రేక్షకులకు సూపర్ న్యూస్ చెప్పింది ప్రముఖ టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio). ఈ మధ్య కాలం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ యూజర్స్ సంఖ్య బాగా పెరిగారనే చెప్పొచ్చు. ఓటీటీ వేదిక వచ్చినప్పటి నుంచి థియేటర్స్ కు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కొంటే చాలు.. హాయిగా ఇంట్లోనే ఏ సినిమా కావాలంటే అది చూసే అద్భుతమైన అప్షన్ ఉంది.

ఇక తాజాగా జియో టీవీ(Jio TV) ప్రీమియం పేరుతో కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభించింది ప్రముఖ టెలికామ్ సంస్థ జియో. సాధారణంగా ప్రతీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కోసం సెపెరేట్  సబ్ స్క్రిప్షన్ తీసుకుంటాము కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. జియో ప్రీపెయిడ్ యూజర్స్ ఒకేసారి 14 ఓటీటీ యాప్స్ ను వాడుకునేలా సింగిల్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది.  ఒకే రీఛార్జ్ తో వివిధ ఓటీటీ సేవలను పొందడానికి ఈ జియో టీవీ ప్రీమియం ప్లాన్ ఉపయోగపడనుంది. ఈ ప్లాన్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, సోని లివ్, జే5, సన్ నెక్స్ట్ ఇలా అన్ని రకాల ప్లాట్ ఫార్మ్స్ వాడుకోవచ్చు.  దీని కోసం మూడు రకాల ప్రీ పెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసింది.

జియో టీవీ ప్రీమియం కోసం 28, 84, 365 రోజుల సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది జియో. ఈ ప్రీమియం ప్లాన్స్ ధర కాల వ్యవధిని బట్టి 28 రోజులకు 398, 84 రోజులకు 1198, 365 రోజులకు 4498 రూపాయలుగా నిర్ణయించింది. ఇక ఒక్కసారి జియో టీవీ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కొనుగోలు చేస్తే ఏకంగా 14 రకాల ఓటీటీ యాప్స్ సేవలను పొందొచ్చు. ఈ సబ్ స్క్రిప్షన్ లో మరో ఆఫర్ కూడా ఉంది. 2జీబీ ఉచిత డేటా, అపరిమితమైన కాల్స్. ఈ ప్లాన్ కేవలం జియో వినియోగదారులకు మాత్రమే.

ఈ ప్లాన్ లో మరో సదుపాయం కూడా ఉంది. వార్షిక ప్లాన్ తీసుకునే వారు EMI పద్దతిలో పే చేసే అవకాశం ఉంది. జియో మొబైల్ నెంబర్ తో జియో టీవీ ప్రీమియం ప్లాన్ పొందొచ్చు. 398 రూ.. ప్లాన్ తో 12 ఓటీటీ యాప్స్ వినియోగం పొందొచ్చు. 1198 ప్లాన్ కొనుగోలు చేస్తే 14 ఓటీటీ యాప్స్ చూసే అవకాశం ఉంటుంది. ఈ నెల 16 తేదీ నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి రానుంది.

Also Read: Ravi Teja: మాస్ రీయునియన్.. మరో సారి రిపీట్ కానున్న క్రేజీ కాంబో..!

#ott #good-news-for-jio-users #jio-tv-premium-plans #reliance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి