Jio Phone: 2,600రూ.లకే యూపీఐ పేమెంట్స్ తో సహా అన్ని ఫీచర్లతో జియో కొత్త ఫోన్..

జియో మరో కొత్త ఫోన్‌ను రిలీజ్ చేసింది. 2,599 రూ.ల ధరతో జియోఫోన్ ప్రైమా పేరుతో 4జీ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. జియోఫోన్‌ ప్రైమా... అమేజాన్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్ లలో కొనుక్కోవచ్చును.

New Update
Jio Phone: 2,600రూ.లకే యూపీఐ పేమెంట్స్ తో సహా అన్ని ఫీచర్లతో జియో కొత్త ఫోన్..

JioPhone Prima 4G: రిలయన్స్‌ జియో కొత్త 4జీ ఫోన్‌ను విడుదల చేసింది. జియోఫోన్‌ ప్రైమా 4జీ అనే ఫీచర్‌ ఫోన్‌ ధర రూ.2,599. దాదాపు రెండు కోట్ల వరకు ఉన్న 2జీ ఫీచర్‌ ఫోన్‌ ఖాతాదారులను 4జీ సేవలవైపు మళ్లించేందుకే ఈ ఫోన్‌ను జియో మార్కెట్లోకి తీసుకువచ్చింది. చూడ్డానికి ఇది బేసిక్ మోడల్లా కనిపిస్తున్నా దీని ద్వారా చాలా ఫీచర్లను పొందవచ్చని చెబుతోంది జియో. దీంతో యూట్యూబ్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ అసిస్టెంట్‌ లాంటి యాప్స్‌ను యాక్సెస్‌ చేయవచ్చు.

Also Read:ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షం

ఈ కొత్త జియో ఫోన్ ఆ కంపెనీ సొంత యాప్స్ అయిన జియో టీవీ, జియో సాన్‌, జియో సినిమా జియో యాప్స్‌ని కూడా యాక్సెస్‌ చేసుకోవచ్చును. అంతేకాదు జియో పే ద్వారా యూపీఐ చెల్లింపులూ (UPI payments) చేయవచ్చును. ఈ కొత్త జియోఫోన్‌ ప్రైమా నానో సింగిల్ సిమ్‌తో వస్తోంది. కయోస్ తో రన్ అవుతుంది. 2.4 ఇంచ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్ 240x320 రిసల్యూషన్, ఎ53 ప్రాసెసర్, 512 ఎమ్బీ రామ్...128జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజితో వస్తుంది. ఇందులో 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. జియోఫోన్‌ ప్రైమా 23 భాషలను సపోర్ట్ చేస్తుంది.

సింగిల్ బ్లూ షేడ్ తో వస్తున్న జియోఫోన్‌ ప్రైమ్.. అమేజాన్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్ లలో లభ్యమవుతుంది. ఇన్ని ఫీచర్లతో ఇంత తక్కువ ధరకు లభిస్తున్న ఫోన్ ఇదే కావడం గమనార్హం.

Also Read:ఐటీ అధికారుల నిఘాలో నామినేషన్.. ఈసీకి పొంగులేటి కంప్లైంట్!

Advertisment
తాజా కథనాలు