Jharkhand : 'జార్ఖండ్ టైగర్'గా ఫేమస్, జార్ఖండ్ కాబోయే సీఎం చంపై సోరెన్ ఎవరో తెలుసా?

జార్ఖండ్‌లో రాజకీయ గందరగోళం తారాస్థాయికి చేరుకుంది. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న హేమంత్ సోరెన్... జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్‌ ఎన్నికయ్యారు. చంపై సోరెన్ ను ఇప్పుడు జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా దాదాపు ఖరారు చేశారు.

New Update
Jharkhand : 'జార్ఖండ్ టైగర్'గా ఫేమస్, జార్ఖండ్ కాబోయే సీఎం చంపై సోరెన్ ఎవరో తెలుసా?

Jharkhand : జార్ఖండ్‌లో రాజకీయ గందరగోళం తారాస్థాయికి చేరుకుంది. సీఎం పదవికి హేమంత్ సోరెన్(Hemant Soren) రాజీనామా చేశారు. ఇప్పుడు చంపై సోరెన్‌(Champai Soren)ను ముఖ్యమంత్రిగా దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. చంపై సోరెన్‌ని జార్ఖండ్ టైగర్ (Jharkhand Tiger)అని కూడా అంటారు. అర్జున్ ముండా(Arjun Munda) ప్రభుత్వంలో చంపై సోరెన్ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్..మాట్లాడుతూ.. జార్ఖండ్‌లోని అధికార కూటమి రవాణా మంత్రి చంపై సోరెన్‌ను జెఎంఎం శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నట్లు చెప్పారు. అవినీతి ఆరోపణలపై హేమంత్ సోరెన్‌ను ఈడీ విచారించిన తరువాత, అతని భార్య కల్పనా సోరెన్‌ను సీఎం చేస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. ఆ ఊహాగానాలకు తెరపడింది. చంపై సోరెన్ ను సీఎం చేయాలని నిర్ణయించారు.

జార్ఖండ్ కాబోయే సీఎం చంపై సోరెన్ ఎవరు?
చంపై సోరెన్ జిల్లింగగోడ గ్రామంలోని గిరిజన నివాసి సిమల్ సోరెన్.. నలుగురు పిల్లలలో ఒకరు. చంపై సోరెన్..సిమల్ సోరెన్ పెద్ద కుమారుడు. చంపై కూడా తన తండ్రితోపాటు వ్యవసాయం చేశాడు. చంపై ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. చంపైకి చిన్న వయస్సులోనే మాంకోతో వివాహం జరిగింది. వారికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చంపై బీహార్ నుండి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ జరిగిన ఉద్యమంలో శిబు సోరెన్‌తో కలిసి పాల్గొన్నాడు. అప్పటి నుంచి అతన్ని 'జార్ఖండ్ టైగర్'గా పిలుస్తున్నారు. ఇక చంపై సోరెన్ తన రాజకీయ జీవితాన్ని సెరైకెలా స్థానం నుండి ఉప ఎన్నికలో స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఘన విజయం సాధించాడు. అనంతరం జార్ఖండ్ ముక్తి మోర్చాలో చేరారు.

అటు భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ మధ్య జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు. సుదీర్ఘ విచారణ అనంతరం హేమంత్ సోరెన్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. సోరెన్ సమాధానంతో ఈడీ సంతృప్తి చెందలేదు. అందుకే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.హేమంత్‌ సోరెన్‌ను ఈడీ తమ కస్టడీలోకి తీసుకుని గవర్నర్‌ హౌస్‌కు తరలించినట్లు జెఎంఎం ఎంపి మహువా మాంఝీ తెలిపారు.

గతంలో ఇదే కేసులో జనవరి 20న హేమంత్ సోరెన్‌ను విచారించారు. ఆ రోజు విచారణ పూర్తి కాలేదని ఓ అధికారి తెలిపారు. ఆ రోజు, సోరెన్‌ను ఏడు గంటలకు పైగా విచారించారు. జార్ఖండ్‌లో 'మాఫియా భూ యాజమాన్యాన్ని అక్రమంగా మార్చే భారీ రాకెట్'పై దర్యాప్తులో భాగంగా సోరెన్‌ను విచారిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: పాత vs కొత్త పన్ను విధానాల్లో ఏది బెస్ట్ ఆప్షన్..? జీతభత్యాల ఉద్యోగులకు ఏది మంచిది?

Advertisment
Advertisment
తాజా కథనాలు