Sita Soren Anti Party Activities : జార్ఖండ్ రాజకీయాల్లో(Jharkhand Politics) కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీతా సోరెన్ పై జేఎంఎం(JMM) అధిష్టానం వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి సుమారు ఆరేళ్ల పాటు పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెపై ఈ వేటు పడినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల సమయంలో సీతా సోరెన్ బీజేపీలో చేరారు.
సీతా సోరెన్(Sita Soren).. హేమంత్ సోరెన్ వదిన. జార్ఖండ్‌లో జేఎంఎం నుంచి సీతా సోరెన్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆమె మార్చిలో బీజేపీలో చేరారు. దీంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెను బహిష్కరించినట్లు జేఎంఎం ప్రకటించింది.
మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న సీతా సోరెన్.. 2009లో తన భర్త దుర్గా సోరెన్ మరణించినప్పటి నుంచి జేఎంఎంలో ఆమెను ఒంటరిని చేయడమే కాకుండా, నిర్లక్ష్యం కారణంగా మార్చి 20న ఢిల్లీలో BJPలో చేరారు. 2019 ఎన్నికల్లో JMM అధ్యక్షుడు శిబు సోరెన్‌ను 47,590 ఓట్ల తేడాతో ఓడించిన సిట్టింగ్ ఎంపీ సునీల్ సోరెన్ స్థానంలో బీజేపీ ఆమెను దుమ్కా లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దింపింది. జూన్ 1న దుమ్కాకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
Also read: కదులుతున్న బస్సులో మంటలు..8 మంది సజీవ దహనం..24 మందికి తీవ్ర గాయాలు!