Prakasam District: బిర్యానీ(Biryani)అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి..అందులోను చికెన్ బిర్యానీ (Chicken Biryani) అయితే మహా ఇష్టంగా తింటారు ఫుడ్ లవర్స్(Food lovers). అయితే అన్ని బిర్యానీలు ఒకేలా ఉండవు అంటున్నారు.సాధారణంగా హోటల్స్, రెస్టారెంట్లలో బిర్యానీ అనగానే చాలామందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. బిర్యానీ ఎంత తిన్నా కొందరికీ తనివితీరదు. రోజు పెట్టినా తింటారు.
ప్రకాశం జిల్లా(Prakasam District) బేస్తవారిపేట జంక్షన్ లో ఓ ఫ్యామిలీ రెస్టారెంట్(Family restaurent) ఉంది. ఆ రెస్టారెంట్ కు ఓ కస్టమర్(customer) వెళ్లాడు. ఎంతో ఆశతో బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. రెస్టారెంట్ సిబ్బంది బిర్యానీ తెచ్చి ఇవ్వడంతో లొట్టలేసుకుంటూ తిన్నాడు. అయితే, సగం బిర్యానీ తిన్న తరువాత అందులో కాళ్ళ జెర్రీని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే రెస్టారెంట్ యజమానిని పిలిచి బిర్యానీ లో ఉన్న జెర్రీ ని చూపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. కస్టమర్స్ కు ఫుడ్ ఇలానేనా చేసేది అంటూ మండిపడ్డారు. వంట చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదా అని విరుచుకుపడ్డారు. ఆనంతరం, ఇలా వంట విషయంలో నిర్లక్ష్యం చేసే వారిపై అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని కస్టమర్ డిమాండ్ చేసారు.
అయితే, ఈ మధ్య కాలంలో పలు రెస్టారెంట్స్ లో పరిశుభ్రత అనేది లేకుండా పోతుంది. వంట వండే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అంతేకాకుండా ఫుడ్ వండే ప్లేస్ లో ఏ మాత్రం పరిశుభత్రను పాటించడం లేదు. కొన్ని కొన్ని రెస్టారెంట్స్ లో ఫుడ్ క్వాలిటీ లేకుండా చేస్తున్నారు. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహారించే రెస్టారెంట్స్ , హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ(Food safety officers) అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.