JEE Main 2024: జేఈఈ మెయిన్ దరఖాస్తులు ప్రారంభం.. ఇదిగో పూర్తి వివరాలు

జేఈఈ మెయిన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 30 రాత్రి 9 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. సెషన్ 1 పరీక్షలు జనవరిలో, సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి.

New Update
JEE Main 2024: జేఈఈ మెయిన్ దరఖాస్తులు ప్రారంభం.. ఇదిగో పూర్తి వివరాలు

దేశంలో ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో వచ్చే ఏడాది ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2024 (JEE main 2024) నోటీఫికేషన్‌ను జారీ చేసింది నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) . జనవరిలో తొలివిడత పరీక్షలు, అలాగే ఏప్రిల్‌లో రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్‌టీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో సెషన్ 1 పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రారంభించింది. నవంబర్‌ 30 రాత్రి 9 గంటల వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఇక జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మధ్య జరుగుతాయి.

మరోవైపు జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను పరీక్ష జరగడానికి మూడు రోజుల ముందు నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 12వ తేదీన సెషన్-1 ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్‌టీఏ నోటిఫికేషన్‌లో తెలిపింది. జేఈఈ మెయిన్ సెషన్-2 ఆన్‌లైన్‌ అప్లికేషన్లు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2 రాత్రి 9 గంటల వరకు స్వీకరిస్తారు. ఇక ఈ పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య జరగనున్నాయి. ఫలితాలు ఏప్రిల్ 25న ప్రకటిస్తారు. జేఈఈ మెయిన్ పరీక్షలను ఆంగ్లం, హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళ్‌, ఉర్దూ ఇలా 13 భాషల్లో నిర్వహించనున్నారు.

తొలి రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జేఈఈ మెయిన్ సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోటిఫికేషన్‌ ముఖ్యాంశాలు..

1. దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజినీరింగ్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ పరీక్షలో సాధించిన ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.

2. జేఈఈ మెయిన్‌లో ఎంత ర్యాంకు వచ్చిన కూడా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు 65 శాతం, మిగిలిన వారికి 75 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని NTA తెలిపింది.

3. పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. పేపర్-1కు 300 మార్కులు, పేపర్-2కు 400 మార్కులు ఉంటాయి.

4. పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. మొదటి షిఫ్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు అలాగే రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.

5. ప్రశ్నపత్రాల్లో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-బీలో 10 ప్రశ్నల్లో అయిదుకు సమాధానాలు గుర్తించాలి. రెండు సెక్షన్లలో కూడా తప్పు సమాధానాలకు మైనస్‌ మార్కులుంటాయి.
6. ఏమైనా సమస్యలు ఉంటే 011 40759000 నంబరుకు ఫోన్‌చేసి సంప్రదించవచ్చు.

దరఖాస్తు ఫీజు వివరాలు 

Advertisment
తాజా కథనాలు