JC Prabhakar : ఎమ్మెల్యే చెప్పినట్లు వినకపోతే సస్పెండ్ చేస్తారా? జేసి

తాడిపత్రి టౌన్ సిఐ హమీద్ ఖాన్ సస్పెండ్ పై మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పెద్దా రెడ్డి చెప్పినట్లు వినకపోతే సస్పెండ్ చేస్తారా? అని మండిపడ్డారు. సిఐ హమీద్ ఖాన్ నీతి నిజాయితీకి కట్టుబడే వ్యక్తి అని కామెంట్స్ చేశారు.

New Update
JC Prabhakar : ఎమ్మెల్యే చెప్పినట్లు వినకపోతే సస్పెండ్ చేస్తారా? జేసి

JC Prabhakar Reddy : తాడిపత్రి(Tadipatri) టౌన్ సిఐ హమీద్ ఖాన్ సస్పెండ్ పై మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) మండిపడ్డారు. ఎమ్మెల్యే పెద్దా రెడ్డి చెప్పినట్లు వినకపోతే సస్పెండ్ చేస్తారా? అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి టౌన్ సిఐ హమీద్ ఖాన్ నీతి నిజాయితీకి కట్టుబడే వ్యక్తి తప్ప ఒకరు చెప్పిన మాట వ్యక్తి కాదని అన్నారు. సస్పెండ్ చేసిన సిఐ హమీద్ ఖాన్ కూలి పని చేయడానికి అయినా సిద్ధపడే మనిషన్నారు. ఎలక్షన్ సమయంకు ఇంకా రెండు నెలలు మాత్రమే టైం ఉండడంతో అధికార పార్టీకి సపోర్ట్ చేయని వారిని ఇలా సస్పెండ్ చేస్తూ ఉంటారని కామెంట్స్ చేశారు.

Also Read: హైదరాబాద్ లో దారుణం.. అప్పు తీర్చలేదని భార్యాభర్తలను ఏం చేశారంటే.?

డీఎస్పీ గంగయ్య ఎమ్మెల్యే తొత్తుగా వ్యవహరిస్తున్నాడని జేసి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రి సబ్ డివిజన్ నుంచి నెలకు దాదాపు రూ. 10 లక్షలు వసూలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. డీఎస్పీ తీరు వల్ల పోలీస్ స్టేషన్లలో ఉన్న సిఐలు, ఎస్ఐలు సైతం ఇబ్బంది పడుతున్నారని విమర్శలు గుప్పించారు. క్రికెట్ బెట్టింగ్ లలో పలు యువ నాయకులపై సీఐ హమీద్ ఖాన్ కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుంటే డిఎస్పి వారిపై పేకాట కేసుగా మార్చినట్లు తెలిపారు. తాడపత్రి సబ్ డివిజన్లో డీఎస్పీ గంగయ్య పలు విభాగాలలో ఐదు మందితో అక్రమంగా డబ్బును వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డీఎస్పీ తన విధులను ఏ మాత్రం సరిగా నిర్వహించడం లేదని వైసీపీ ఎమ్మెల్యే చెప్పినట్లు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు