ఇప్పటివరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన జై షా.. తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కొత్త ఛైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 1న ఆయన ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అత్యంత పిన్న వయస్సులో జై షా (36) ఇలాంటి ఉన్నతమైన పదవి సాధించిన ఘనతను సొంతం చేసుకున్నారు. మూడు సంవత్సరాల పాటు ఆయన ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగననున్నారు. అంతేకాదు జై షా పదవీకాలాన్ని కూడా పొడిగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. జై షా గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: కవితపై ఛార్జిషీటులో ఏముంది.. బెయిల్ రావడానికి కారణం ?
బీజేపీ టాప్ లీడర్, కేంద్రమంత్రి అమిత్ షా కొడుకే జై షా. 2009లో మొదటిసారిగా ఆయన క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆటగాడిగా కాకుండా పాలకుడిగా అరంగేట్రం చేశారు. 2009లో జై షా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్‌గా ఉన్నారు. 2013 వరకు ఇదే పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2013 నుంచి 15 వరకు జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు వహించారు. ఇక 2015లో బీసీసీఐలోకి జైషా ప్రవేశించారు. బీసీసీఐ ఫైనాన్స్, మార్కెటింగ్ కమిటీలో స్థానం లభించింది. 2019 వరకు ఇదే పదవిలో ఉన్నారు.
ఆ తర్వాత 2019 అక్టోబర్‌లో జై షా బీసీసీఐ సెక్రటరీగా నియమితులయ్యారు. అప్పుడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. 2021లో ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షడిగా ఉన్నారు. ఇప్పడు ఆ పదవి కూడా ఉంది. జై షా ఒకేసారి బీసీసీఐతో పాటు ఐసీసీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీసీసీఐలో డొమెస్టిక్ క్రికెట్‌కు సంబంధించి కూడా చర్యలు తీసుకున్నారు. ఫీజు పెంచడం, ప్రైజ్‌మనీ ప్రకటన ఇలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. పలు మీడియా నివేదికల ప్రకారం.. జై షా నికర ఆస్తి రూ.124 కోట్లు. వ్యాపారాలే ఆయన ఆదాయానికి ప్రధాన వనరులు. ఆయన అగ్రికల్చరల్ కమోడిటీస్ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేసే ‘టెంపుల్ ఎంటర్‌ప్రైజ్’ కంపెనీకి డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే కుసుమ్ ఫిన్‌సర్వ్‌లో 60 శాతం వాటా ఉంది. జై షా నికర ఆస్తుల విలువ సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉండొచ్చని మరికొన్ని నివేదికలు కూడా వెల్లడించాయి.
Also Read: వారి కంట్లో పడితే ఖతమే.. కెరీర్ సర్వనాశనం: బాలీవుడ్ దుర్మార్గంపై కంగన ఫైర్!
ఇదిలాఉండగా.. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే పదవి కాలం నవంబరు 30తో ముగుస్తుంది. అయితే మూడోసారి బరిలో ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఛైర్మన్ పదవి కోసం నామినేషన్ల గడువు కూడా ముగిసింది. ఈ పదవికి ఏకైక నామినీగా జై షా నిలిచారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఛైర్మన్ పదవికి ఎన్నికైనట్లు ఐసీసీ ప్రకటన చేసింది. 2020లో గ్రెగ్ బార్ క్లే కూడా ఏకగ్రీవంగా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. జైషా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాక పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా నామినేట్ అవ్వడం గౌరవంగా భావిస్తున్నానని.. క్రికెట్‌ను మరిన్ని ప్రపంచ దేశాలకు చేరువ కావడానికి నిబద్ధతో పనిచేస్తానని అన్నారు. జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన 5వ భారతీయుడు. ఇంతకుముందు జగన్ మోహన్ దాల్మియా ( 1997-2000), శరద్ పవార్ ( 2010-2012), ఎన్ శ్రీనివాసన్ ( 2014-2015), శశాంక్ మనోహర్ ( 2015-2020) ఈ బాధ్యతలు నిర్వహించారు.