Bumrah: బంతులు కాదు బుల్లెట్లు.. రికార్డ్ చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే!

టెస్టుల్లో వేగంగా 150 వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌గా జస్‍ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. 6781 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో బెన్ స్టోక్స్‌ను ఔట్ చేశాక ఈ రికార్డుకు చేరుకున్నాడు.

Bumrah: బంతులు కాదు బుల్లెట్లు.. రికార్డ్ చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే!
New Update

India vs England: స్పిన్నర్లకు అనుకూలం అనుకున్న విశాఖ పిచ్‌ పై టీమిండియా స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మరోసారి అదరగొట్టాడు. స్వదేశంలో ఇంగ్లండ్‍ (England) తో జరుగుతున్న రెండో టెస్టులో బుల్లెట్లలా విసిరిన బుమ్రా బంతులను ఆడలేక, ఆడినా తట్టుకోలేక ఇంగ్లాండ్‌ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముఖ్యంగా రెండో స్పెల్‌లో ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతి వేసి రూట్‌ను బుట్టలో వేసుకున్న విధానం, స్టోక్స్‌ను నిశ్చేష్టుడిని చేస్తూ బౌల్డ్‌ చేసిన తీరు అద్భుతం. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత కాస్త తడబడ్డ బుమ్రా.. ఇప్పుడు తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. బుమ్రా కెరీర్ లోని అత్యుత్తమ ప్రదర్శనల్లో ఈ ఇన్నింగ్స్ నిలిచిపోతుందనే సందేహం లేకపోగా ఈ క్రమంలో బుమ్రా ఓ రికార్డు నెలకొల్పాడు.

తొలి పేసర్‌గా చరిత్ర..

ఈ మేరకు టెస్టుల్లో వేగంగా 150 వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‍లో 6781 బంతుల్లోనే 150 వికెట్లను దక్కించుకున్నాడు. బెన్ స్టోక్స్‌ను ఔట్ చేశాక ఈ రికార్డుకు బుమ్రా చేరుకున్నాడు. అంతేకాదు అంతర్జాతీయ టెస్టుల్లో కనీసం 150 వికెట్లు తీసిన బౌలర్లలో అత్యుత్తమ సగటు పరంగా బుమ్రా (20.28) రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఉమేశ్ యాదవ్ (7661 బంతులు)ను దాటేసి వేగంగా 150 టెస్టు వికెట్లు దక్కించుకున్న భారత ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా అగ్రస్థానానికి వచ్చాడు. మహమ్మద్ షమీ (7755), కపిల్ దేవ్ (8378) మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. అలాగే టెస్టుల్లో 10వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు జస్‍ప్రీత్ బుమ్రా. దీంతో టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన భారత పేసర్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఈ లిస్టులో చెరో 11 సార్లతో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ ఫస్ట్ ప్లేస్‍లో ఉన్నారు.

ఇది కూడా చదవండి : ABd: కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడు.. ప్రకటించిన డివిలియర్స్‌

ఇక రెండో టెస్టులో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేయటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 రన్స్ చేసింది. ఇంగ్లండ్ రెండో రోజే తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండో రోజు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 28 రన్స్ చేసింది. దీంతో 171 పరుగుల ఆధిక్యానికి చేరింది. మూడో రోజు ఆటను కొనసాగించనుంది.

#jasprit-bumrah #fastest-150-wickets #created #history
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe